- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
శంషాబాద్ ఉందానగర్ టు లింగంపల్లి ఎంఎంటీఎస్ రైలు ప్రారంభం..
దిశ, శంషాబాద్ : ఎంఎంటీఎస్ సర్వీస్ పొడిగించడం వల్ల ప్రజల కష్టాలు తీరుతాయని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. శనివారం హైదరాబాద్ లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రధాని నరేంద్ర మోడీ వందే భారత్ రైలు ప్రారంభించడంతోపాటు శంషాబాద్ ఉందా నగర్ నుండి లింగంపల్లి వరకు ఎంఎంటీఎస్ రైలును పొడగిస్తూ ప్రారంభించారు. ఆ ప్రత్యేక ప్రసారాన్ని శంషాబాద్ లోని ఉందా నగర్ రైల్వే స్టేషన్లో రైల్వే అధికారులతో పాటు వీక్షించి అనంతరం నూతనంగా ప్రారంభమైన ఎంఎంటీఎస్ రైలులో శంషాబాద్ ఉందా నగర్ రైల్వే స్టేషన్ నుండి బుద్వేల్ వరకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్,మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మారెడ్డి రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ నుండి నిత్యం కూరగాయల మార్కెట్ కు ఎంతో మంది ప్రయాణికులు రైలు ద్వారా శంషాబాద్ కు వచ్చి కొనుగోలు చేసుకుని ఆటోల ద్వారా బస్సులలో ఇబ్బందులు పడుకుంటా వెళుతూ ఉంటారని అన్నారు.
ఇప్పుడు ఎంఎంటీఎస్ రైలు పొడిగించి వేయడం వల్ల ప్రయాణికులు రైలు ప్రయాణంలో ఎంతో సురక్షితంగా ప్రయాణిస్తారని అన్నారు. శంషాబాద్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం వల్ల ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఎంతో మంది ప్రజలు ఇక్కడ నివసిస్తూ ఉంటారని దీనిని దృష్టిలో ఉంచుకొని కాచిగూడ నుండి వేళ్లే రైల్లన్నింటిని శంషాబాద్ ఉందా నగర్ రైల్వే స్టేషన్ లో ఆపితే ప్రయాణికులకు మరింత సులభతరం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైజర్ బండి గోపాల్ యాదవ్, జెడ్పీటీసీ నీరటీ తన్వీరాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేష్ గౌడ్, కౌన్సిలర్లు అజయ్, శ్రీకాంత్ యాదవ్, నాయకులు గణేష్ గుప్త, మహేందర్ రెడ్డి, కొనమొల శ్రీనివాస్, మురళి యాదవ్, దేవేందర్, మహేందర్, సంగప్ప, రాములు, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.