- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిరసనల్లో కూడా వర్గపోరు..
దిశ, తాండూరు రూరల్ : కంచుకోటలాంటి జిల్లా ప్రస్తుతం వర్గ పోరుకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. వారి ఆధిపథ్యపోరును సైతం బాధ్యతగా తీసుకున్నట్టు కనిపిస్తోంది. పరిస్థితి మరీ దారుణంగా మారుతోంది. కీలక నేతలు కూడా ఎవరికి వారు గ్రూపులను ప్రోత్సహిస్తూ పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్నారని కేడర్ మదనపడుతున్నారు. ఇప్పుడు ఇదే బీఆర్ఎస్ లో హాట్ టాపిక్‌గా మారింది. ఇద్దరూ తాండూరు నుంచి పోటీ చేసిన వారే. పార్టీలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులలో ఉన్నవారే.. బీఆర్ఎస్ పార్టీని పటిష్ఠ పరచాల్సిన బాధ్యత ఇద్దరిపైనా ఉంది. అయితే ఇద్దరూ పైకి నవ్వుతూ కనిపించినా.. వారి మధ్య కోల్డ్ వార్ ఉందన్నది పార్టీలో అందిరికీ తెలిసిందే.
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ పై రూ.50 పెంచడంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిరాసనాలు చేపట్టారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో శుక్రవారం చేపట్టిన నిరసన మరోసారి వర్గపోరుకు తావు తీసింది. తాండూరు వ్యాప్తంగా ఇటు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో, అటు తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో పోటాపోటీ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నిరసనలను నిర్వహించే నియోజకవర్గంలో ఎలాంటి ప్రయోజనం లేదని పలుపార్టీల్లో లోలోపల వినిపిస్తున్న వ్యాఖ్యలు.
అయోమయంలో నియోజకవర్గ ప్రజలు..
తాండూరు నియోజకవర్గం బీఆర్ఎస్ ఓట్ బ్యాంకింగ్ అని మనకందరికీ తెలిసిన విషయమే. అయితే ఈసారి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎమ్మెల్యేగా గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆలోచనలో ప్రజలుంటే బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు పెట్టుకుని పార్టీపరువు నిలువునా తీస్తున్నారని నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీలో వర్గవిభేదాలు పెట్టుకుంటే పార్టీ ఎలా ముందుకు సాగుతుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందా..? లేదా అనే అయోమయంలో నియోజకవర్గం ప్రజలు ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం వర్గపోరు సమస్యను పరిష్కరించి పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా ఉండాలని ప్రజలు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు కోరుతున్నారు.