- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బీజేపీని దేశంలో గద్దె దింపుతాం : ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి
దిశ, పరిగి : పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజీల్ ధరలను వెంటనే తగ్గించకకుంటే కేంద్రప్రభుత్వానికి బుద్ది చెబుతామని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి అన్నారు. పరిగిలోని తన నివాసంలో బుధవారం విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలు పెంచడం వల్ల వాటి ప్రభావం నిత్యావసర సరుకుల పై పడుతుందన్నారు. దీంతో పేద, మద్య తరగతి వారు బతుకు భారంగా మారిందన్నారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటూ నినాదాలు చేయడమే తప్ప సామాన్యుడు కడుపు మీద కొట్టేలా ధరలు పెంచుతుందన్నారు.
తాగాజా గ్యాస్ సిలిండర్ పై 50, కమర్షల్ సిలిండర్ పై 350 రూపాయలు పెంచుతూపోతూ సగటు బతుకు జీవిపై మోయలేని భారం వేస్తుంన్నారు. ప్రైవేటు దోపిడీ దారులు, మోడీ స్నేహితులకు ఏకంగా 12 లక్షల కోట్లు మాఫీ చేసి ఈ ధరలన్నీ పెంచడం ఎంతవరకు సమంజసమన్నారు. ఇప్పటికైనా కేంద్రం పెంచిన ధరలను తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ అంతిగారి సురేందర్ కుమార్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రొయ్యల ఆంజనేయులు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ శివన్నోళ్ల భాస్కర్, నాయకులు బేతు ప్రవీన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.