గుర్రంగూడకు చెందిన వ్యక్తి అదృష్యం..

by Sumithra |   ( Updated:2023-03-01 17:34:13.0  )
గుర్రంగూడకు చెందిన వ్యక్తి అదృష్యం..
X

దిశ, మీర్ పేట్ : వ్యక్తి అదృశ్యమైన ఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుర్రం గూడ టీచర్స్ కాలనీకి చెందిన కాశిరెడ్డి లింగారెడ్డి (36) తన ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లారు.

ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాలలో, బంధువుల ఇళ్లల్లో వెతికారు. అయినా ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో భార్య ఉషారాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఈ నరసింహ నాయక్ తెలిపారు

Advertisement

Next Story