- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఉర్సు ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి..
దిశ, బడంగ్ పేట్ : మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 375 సంవత్సరాల చరిత్ర గల పహాడీ షరీఫ్ బాబా షర్ఫద్దీన్ దర్గాలో మార్చి 9వ తేదీన 757వ ఉర్సు ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏర్పాట్లను రాష్ట్ర విద్యాశాఖా మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి గురువారం పరిశీలించారు. ముందుగా మంత్రి దర్గాను సందర్శించి చాదర్, పూలు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
మార్చి 9 నుంచి 13వ తేదీ వరకు జరుగనున్న ఉర్సు ఉత్సవాల ఏర్పాట్లను మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలని మంత్రి సబితా జల్పల్లి మున్సిపల్ కమిషనర్ వసంతను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ అబ్దుల్లాహ్ బిన్ అహ్మద్ సాది, కమిషనర్ వసంత, బీఆర్ఎస్ నాయకులు సయ్యద్ యూసుఫ్ పటేల్, ఖైసర్ బామ్, షేక్ అప్జల్, ఇక్బాల్ బిన్ ఖలీఫా తదితరులు పాల్గొన్నారు.