Maoists: బస్తర్‌లో మరో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు మావోయిస్టులు హతం

by vinod kumar |
Maoists: బస్తర్‌లో మరో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు మావోయిస్టులు హతం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఛత్తీస్‌గఢ్‌ (Chathisgarh)లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. నారాయణపూర్, కొండగావ్ జిల్లాల సరిహద్దుల్లో పోలీసులు, నక్సలైట్ల మధ్య బుధవారం జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. కిలాం-బార్గమ్ గ్రామాల అటవీ ప్రాంతంలో నక్సలైట్లు ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందించింది. దీంతో డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్(DRG), బస్తర్ ఫైటర్స్, రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలోనే పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయని బస్తర్ రేంజ్ డీఐజీ సుందర్‌రాజ్ (Sunder raj) తెలిపారు. ఘటనా ప్రాంతంలో ఇద్దరు మావోయిస్టుల మృత దేహాలతో పాటు ఒక ఏకే-47 రైఫిల్, ఇతర ఆయుధాలు, భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

మృతి చెందిన మావోయిస్టులను తూర్పు బస్తర్ డివిజన్ సభ్యుడు హల్దార్, ఏరియా కమిటీ సభ్యుడు రామేగా గుర్తించారు. వీరిలో హల్దార్ పై రూ.8లక్షలు, రామేపై రూ.5 లక్షల రివార్డు ఉన్నట్టు ఐజీ తెలిపారు. అంతకుముందు దంతేవాడ-బీజాపూర్ సరిహద్దులోని భైర్మగఢ్ ప్రాంతంలో ముగ్గురు నక్సలైట్లు మృతి చెందారు. దీంతో ఈ ఏడాది ఛత్తీస్ గఢ్‌లో జరిగిన వేర్వేరు ఎన్ కౌంటర్లలో 140 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నారాయణపూర్ కొండగావ్‌తో సహా ఏడు జిల్లాలతో కూడిన బస్తర్ డివిజన్‌లోనే 123 మందిని హతమార్చారు.



Next Story

Most Viewed