నన్ను ఆదరించండి.. ఆశీర్వదించండి : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

by Aamani |   ( Updated:2024-05-01 14:59:55.0  )
నన్ను ఆదరించండి.. ఆశీర్వదించండి : కొండా విశ్వేశ్వర్ రెడ్డి
X

దిశ, తాండూరు : బుధవారం తాండూరు పట్టణంలో జరిగిన వీరశైవ సమాజ్ ఆత్మీయ సమ్మేళనంలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. వీరశైవ సమాజ్ అధ్యక్షుడు బస్వరాజ్ గారి నాయకత్వంలో 200 మంది సభ్యులు బీజేపీలో చేరారు. వారికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాషాయ కండువా కప్పి సాధారంగా భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..వీరశైవం స్థాపకుడు బసవేశ్వరుడు సమాజంలోని అంతరాలను ప్రశ్నించిన మహనీయుడని కొనియాడారు. ఆయన చూపిన మార్గం, ఆదర్శాలు, నడవడిక మేటి నాయకులకు మార్గదర్శకమని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆయన ఆదర్శంగా తీసుకొని సమాజంలో మార్పు కోసం ప్రతి ఒక్కరు సేవా మార్గంలో పయనించాలని పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, బీజేపీ పదేళ్ల పాలనలో అన్ని రంగాల్లోనూ పురోగతి సాధించి దేశం అభివృద్ధిలో అగ్రభాగానికి చేరిందన్నారు.భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ కు భారతీయ జనతా పార్టీ నిత్యం పాటుపడుతుందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ కుమార్ , జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్ , మల్లేష్ , పట్టణ అధ్యక్షుడు మల్లేశం, బొప్పి శ్రీహరి, అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed