ప్రియుడితో భర్తను హత్య చేయించిన భార్య…కేసును ఛేదించిన కడ్తాల్ పోలీసులు

by Disha Web Desk 11 |
ప్రియుడితో భర్తను హత్య చేయించిన భార్య…కేసును ఛేదించిన కడ్తాల్ పోలీసులు
X

దిశ,కడ్తాల్,శంషాబాద్: గత నెల 30న కడ్తాల్ మండలంలోని మక్త మాదారం గేట్ సమీపంలో బటర్ ఫ్లై సిటీ వెంచర్ లో లభ్యమైన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం... బాలాపుర్ మండలం నాదర్ గుల్ గ్రామం బాలాజీనగర్ కు చెందిన తాండ్ర రవీందర్(45) గా గుర్తించినట్లు శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి తెలిపారు. రవీందర్ మృతికి గల కారణాలను సోమవారం శంషాబాద్ డిసిపి కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు వివరాలను వెల్లడించారు. నాదర్ గుల్ కు చెందిన రవీందర్, గీత భార్యభర్తలు. రవీందర్ సెంట్రింగ్ పనులు చేస్తుండగా, గీత చింతల్ కుంట వద్ద విశాల్ మార్ట్ లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తుంది.

రవీందర్ తన సెంట్రింగ్ మెటీరియల్ ను తరలించడానికి బాలాపుర్ కు చెందిన కడారి యాదగిరి డీసీఎం వాహానాన్ని కిరాయికి తీసుకెళ్లేవాడు.ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. రవీందర్ భార్య గీత సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగంతో పాటు వెస్టేజ్ అనే కంపెనీకి చెందిన ప్రొడక్ట్ ను సేల్స్ చేసేది. తన భార్య గీత చేస్తున్న సేల్స్ లో చేరితే మంచి లాభాలు వస్తాయని చెప్పి యాదగిరిని అందులో చేర్పించాడు.యాదగిరికి మృతుడు రవీందర్ భార్య గీతతో పరిచయం అయింది. పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. భార్య, యాదగిరి మధ్య అక్రమ సంబంధం తెలిసి రవీందర్ భార్యను తరుచు శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు.

భర్త పెట్టే బాధలు భరించలేక ప్రియుడు యాదగిరి తో కలిసి రవీందర్ ను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. గత నెల 29న రవీందర్ తన భార్య సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న విశాల్ మార్ట్ వద్దకు రాగా సమాచారాన్ని ప్రియుడు యాదగిరికి చేరవేసింది.ఇదే అదునుగా భావించిన యాదగిరి తన స్నేహితుడు బాలాపుర్ కు చెందిన మరో డిసిఎం వాహనం డ్రైవర్ చిత్రం అనిల్ కుమార్ తో కలిసి విశాల్ మార్ట్ వద్దకు కారులో వచ్చారు. అక్కడున్న రవీందర్ ను బలవంతంగా కారులోకి ఎక్కించుకుని బొంగులుర్ గేట్ వద్దకు తీసుకెళ్లారు. గీతకు అనిల్ కుమార్ ఫోన్ చేసి లైన్లోనె ఉంచి రవీందర్ ను చిత్రహింసలకు గురిచేసి వీల్ రాడ్ తో తలపై కొట్టగా అపస్మారకస్థితిలోకి వెళ్లాడు.

మార్గం మధ్యలో బాలాపుర్ హెచ్ పి పెట్రోల్ పంపులో ఫ్లాస్టిక్ బాటిల్ లో లీటర్ పెట్రోల్ నింపుకుని కడ్తాల్ మండలంలోని మక్తమాదారం గేట్ బటర్ ఫ్లై సిటీ వెంచర్ వద్దకు చేరుకున్నారు. అక్కడ చెట్ల పొదలలో అతడిని పడవేసి వెంట తెచ్చిన పెట్రోల్ ను అతడి పై చల్లి నిప్పంటించారి. మంటలతో సృహలోకి వచ్చిన రవీందర్ లేచి కొద్ది దూరం వెల్లి కుప్పకూలి పడి చనిపోయాడని డిసిపి నారాయణరెడ్డి వివరించారు. గత నెల 30న బటర్ ఫ్లై సిటీ వెంచర్ లో మృతదేహం పడివున్నట్లు మక్తమాదారం పంచాయతీ కార్యదర్శి నెనావత్ రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తునకు మూడు బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

దర్యాప్తు లో భర్త రవీందర్ కనిపించడం లేదని రవీందర్ బావ రఘునందన్ కు గీత ఫోన్ లో సమాచారం తెలిపింది.వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సుచించినా గీత ఫిర్యాదు చేయలేదు. విషయం తెలిసి రఘునందన్ గీత వద్దకు వచ్చి నిలదీసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయించారు. ఫిర్యాదులో తన భర్త రవీందర్ కనిపించకుండా పోవడానికి యాదగిరి పై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదులో పేర్కొన్నారు.ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తులో భాగంగా సిసిటీవి వీడియో ఫుటేజ్,టెక్నికల్ డేటా ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులైన యాదగిరి,అనిల్ కుమార్,గీత లను అరెస్ట్ చేసి హత్యకు ఉపయెగించిన కారు, వీల్ రాడ్డు,3సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపర్చిన ట్లు డిసిపి నారాయణరెడ్డి వివరించారు.

Next Story

Most Viewed