- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి : కేఎల్ఆర్
by Kalyani |

X
దిశ, బడంగ్ పేట్: మహానగరంగా మారుతున్న మహేశ్వరం నియోజకవర్గంలో ప్రైవేటు కంపెనీల్లో స్థానికులకే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కాంగ్రెస్ ఇంచార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కోరారు. ఇళ్లు, స్థలాలు ఎయిర్ పోర్ట్ కోసం త్యాగం చేసినా మాకు ఇంకా న్యాయం జరగలేదని మహిళలు మొరపెట్టుకున్నారు. తుక్కుగూడ కార్యాలయంలో అనేక సమస్యలతో జనం బారులు తీరారు. వారి సమస్యలకు సానుకూలంగా స్పందించిన కేఎల్ఆర్ వెంటనే అధికారులతో ఫోన్ లో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని కోరారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని కిచ్చెన్న హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Next Story