- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇనాం భూములు స్వాహా..100 ఎకరాల్లో వెంచర్ ఏర్పాటు
దిశ, రంగారెడ్డి బ్యూరో : మహేశ్వరం నియోజకవర్గంలో అక్రమార్కులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై ప్రభుత్వ, అసైన్డ్ మెంట్, భూధాన్, లావుణి పట్టా, ఇనామ్ భూములను దర్జాగా కబ్జాలు చేస్తున్నారు. మహేశ్వరం మండలంలోని తుమ్మలూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 145 లో 15.38 ఎకరాలు, 146 లో 15.1 ఎకరాలు,147 లో 19.18 ఎకరాలు,148 లో 15.26 ఎకరాలు, 149లో 17.15 ఎకరాలు,150 లో 16.18 ఎకరాలు మొత్తం సుమారు 100 ఎకరాలు దస్తుగర్దన్ (సెరుబా ఇనాం)ఇనాం భూముల్లో సాయిప్రియ వెంచర్ యాజమాన్యం డీటీసీపీ, హెచ్ఎండీఏ పేరుతో వెంచర్ చేశారు. 145-150 సర్వే నంబర్లలో దస్తుగర్ధన్ ఇనాం భూములకు ఎలాంటి ఓఆర్సీలు జారీ కాకుండానే పట్టా భూములుగా మార్చారు. నేటికీ ధరణి లో సర్వే నంబర్ 150ఆ/2 దస్తుగర్ధన్ ఇనామ్ భూమి అని చూపిస్తుంది. ప్రస్తుతం ఎకరా భూమి రూ.5 కోట్లు పలుకుతుంది. 100 ఎకరాల ఇనాం భూముల విలువ బహిరంగ మార్కెట్లో 500 కోట్లు ధర పలుకుతుంది.
పట్టాలుగా మార్పు...?
తుమ్మలూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 145-150 ఇనాం భూములకు ఎటువంటి ఓవర్సీలు జారీ చేయకుండానే పట్టా భూములుగా మార్చారు. ప్రస్తుతం 145- 150 సర్వే నెంబర్ లో సాయి ప్రియ వెంచర్ యాజమాన్యం వెంచర్ చేసింది. ఇనామ్ భూములను అప్పటి రెవెన్యూ శాఖ అధికారులు ఏ విధంగా పట్టా భూమి గా మార్చారో రెవెన్యూ శాఖ అధికారులే తెలపాలి.
ఇనాం భూములను పట్టా భూములుగా మార్చాలంటే వాస్తవంగా ఉన్న ఇనాందారులకు, నాలుగు రకాల కౌలుదారుల పేర్ల మీద లేకపోతే వారి వారసుల మీద మాత్రమే ఓఆర్సీలు(ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికెట్) తీసుకున్న తర్వాతనే పట్టా భూములుగా మార్చుకునే అవకాశం ఉంటుంది. కానీ 145-150 సర్వే నెంబర్ లలో వాస్తవంగా ఉన్న ఇనాం దారుల, కౌలుదారుల పేరు మీద ఓఆర్సీలు జారీ కాకుండానే పట్టా భూములుగా మార్చారు. 1955లో హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న ఇనామ్ భూములన్ని ప్రభుత్వ భూములుగా మారాయి.
ఇనాం భూములకు 1973 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఇనాం భూములను వాస్తవంగా సాగు చేసుకుంటున్న ఇనాందారులకు, అనుభవంలో ఉన్న అనుభవదారులకు, కౌలు దారులకు వారి వారసులకు ఓఆర్సీలు ఇవ్వాలని ప్రభుత్వం ఓ చట్టం తీసుకువచ్చింది. ఓఆర్సీలు తీసుకొని పట్టా భూమిగా మార్చే అవకాశం కల్పించింది. సాయి ప్రియ వెంచర్ నిర్వాహకులు మాత్రం 100ఎకరాల దస్తుగర్ధాన్ ఇనామ్ భూముల్లో దర్జాగా వెంచర్ చేశారు. నేటికీ సాయి ప్రియ వెంచర్ సంబంధించిన భూముల్లో దస్తుగర్దన్ ఇనాం భూమి అని చూపిస్తుంది. ప్రస్తుతం ఎకరా భూమి 5 కోట్ల ధర పలుకుతుంది. సుమారు 500 కోట్ల ఇనాం భూములు ఎసరు పెట్టారు.
రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల మౌనం
సర్వే నెంబర్ 144లో తిమ్మాయి చెరువు 34.05 ఎకరాలు సర్కారీ భూమి ఉంది. 145,148,149 సర్వే నంబర్లు చెరువు ఎఫ్ టిఎల్ సగభాగం ఉంది. ఎఫ్ టీఎల్ పరిధిలో ఉన్న ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. రెవెన్యూ ఇరిగేషన్ శాఖ అధికారులు సాయి ప్రియ వెంచర్ నిర్వాహకులు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఏదో అంతర్యం దాగి ఉందానే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా తిమ్మాయి చెరువు పూర్తి ఎఫ్ టిఎల్ పరిధిని నిర్ధారించాలి గ్రామస్తులు కోరుతున్నారు.