- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అబ్దుల్లాపూర్ మెట్ లో అక్రమ నిర్మాణాల జోరు
దిశ, అబ్దుల్లాపూర్మెట్ః రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని అక్రమ నిర్మాణాలు జోరుగా వెలుస్తున్నాయి. అనుమతులు లేకున్నా రాత్రికి రాత్రే కట్టేస్తున్నారు. స్థానికంగా ఉన్న అధికారులకు మండల స్థాయిలో ఉన్న అధికారులకు మధ్య సమన్వయ లోపంతోనే ఈ నిర్మాణాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. మండల పరిధిలోని జాఫర్ గూడ గ్రామంలో ఓ యజమాని తన వ్యవసాయ భూమిలో పెద్ద ఎత్తున షెడ్ నిర్మాణం చేపట్టారు. స్థానిక కార్యదర్శి సెలవులో ఉన్నందున ఇదే అదనంగా భావించిన సదరు వ్యక్తి ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టారు. పైగా అధికారులను తప్పుదోవ పట్టిస్తూ అధికారులు చెప్పినట్లుగా పనులు నిలిపివేశానని చెబుతున్నాడు. కానీ చుట్టూ ప్రహరీ గోడ కట్టి లోపల పనులు చేస్తున్నట్టు సమాచారం. విషయం తెలుసుకున్న సంబంధిత అధికారులు ప్రశ్నిస్తే తామ నిర్మాణాన్ని ఆపేసి హెచ్ఎండిఏ అనుమతుల కోసం వెళ్తున్నామని తప్పుడు సమాచారాన్ని ఇస్తూ తమ పని తాము చేస్తూనే ఉన్నారు. కార్యదర్శి సెలవులో ఉండడం, పై అధికారి ఎంపీవో నూతనంగా రావడంతో వీరిద్దరి మధ్య సమన్వయ లోపాన్ని గమనించిన పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా గౌరెల్లి లష్కర్ గూడా, తారామతి పేట, కుత్బుల్లాపూర్ తో పాటుపలు గ్రామాలలో ఆక్రమ నిర్మాణాల జోరు సాగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అనుమతులు నిర్మాణాలపై సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి చర్యలు చేపట్టి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
ఆరోగ్య కారణాల రీత్యా లాంగ్ లీవ్ లో ఉన్నాను..
శివ, సెక్రెటరీ, జాఫర్ గూడా
ఆరోగ్య కారణాల రీత్యా కొద్దిరోజులుగా సెలవులో ఉన్నాను. ఈ విషయాన్ని పై అధికారులకు వివరించాను. మరికొన్ని రోజుల్లో నూతన సెక్రటరీ వచ్చే అవకాశం ఉన్నందున నేనేమీ అక్రమ నిర్మాణాలపై స్పందించలేను.