- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ పార్టీ : ఎమ్మెల్యే

దిశ, శంషాబాద్ : మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు అని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు. శంషాబాద్ కౌన్సిలర్ జహంగీర్ ఖాన్ ఆధ్వర్యంలో ఆదివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని అగ్బార్ కాలనీలో నిర్వహించిన ఇఫ్తార్ పార్టీలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముస్లింలకు రంజాన్ మాసం పవిత్రమైన మాసం అన్నారు. రంజాన్ మాసంలో కఠోర నియమాలతో ఉపవాస దీక్షలు చేపడుతారని అన్నారు. మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. ఇఫ్తార్ విందుతో సోదరభావం పెంపొంది లౌకిక విలువలు కాపాడుతూ ప్రజల మధ్య ఐక్యత భావం పెంచుతుందంటారు. చిన్నపిల్లల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేయడం గొప్ప విషయమన్నారు. అల్లా ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గణేష్ గుప్తా,రాచమల్ల సిద్దేశ్వర, మహేందర్ రెడ్డి, దూడల వెంకటేష్ గౌడ్, సురేష్ గౌడ్, ప్రభాకర్, సంతోష్ గౌడ్,అంజద్ ఖాన్, ఇర్ఫాన్, సంజయ్ యాదవ్, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, విఠల్ నాథ్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రఫిక్, ఆయిల్ కుమార్, మెరుగు సురేష్ తదితరులు పాల్గొన్నారు.