సీఎం చొరవతో నాలుగు లైన్ల రహదారి ప్రారంభం : ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి

by Kalyani |
సీఎం చొరవతో నాలుగు లైన్ల రహదారి ప్రారంభం : ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి
X

దిశ, పరిగి : బీఆర్ఎస్ పార్టీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే మన జిల్లా అభివృద్ధిలో కుంటుపడిందని పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి అన్నారు. పరిగి డివిజన్ పూడూరు మండలం మన్నెగూడ లో వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ… ఆలూరు గేటు వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తున్నామన్నారు. అనంతరం ప్రభుత్వం తరఫున 5 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జాతీయ రహదారి పనులను అడ్డుకున్నారని, ఇప్పుడు మళ్లీ కావాలని డ్రామా రావు డైరెక్షన్లో కొందరు ధర్నాలు చేయడం కరెక్ట్ కాదు అన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రత్యేక చొరవ తీసుకొని ప్రభుత్వం తరపున వాదించి కోర్టులో కేసులు ఎత్తి వేయించారన్నారు.

వేరే ఎన్ జి ఓ వాళ్ళు మరిన్ని కేసులు వేసినప్పుడు మరోసారి కోర్టులో ప్రభుత్వం తరపున వాదించి కోర్టు అనుమతి నవంబర్ 28 నుండి పొందిన తర్వాత తక్షణం రోడ్డు పనులు ప్రారంభించారన్నారు. గత నెల 28 నుంచి మొయినాబాద్ మండలంలోని మృగవాని పార్క్ వద్ద, కనక మామిడి వద్ద, ముడిమ్యాల వద్ద వంపులు, జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభం అయ్యాయని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ప్రభుత్వం రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో ఉంది అని తెలిపారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా బిఆర్ ఎస్ పార్టీ నాయకులు మంత్రులుగా పని చేసిన ఈ ప్రాంత నాయకులు రోడ్డును పూర్తి చేయకుండా ఇప్పుడు అనవసరంగా రేవంత్ రెడ్డి పై ఈ ప్రాంత ఎమ్మెల్యేల పై అబద్దపు నిందలు వేయడం తగదని హెచ్చరించారు.ఈ ప్రాంత అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటికే 330 ఎకరాల భూములు రోడ్డు విస్తరణకు అవసరం ఉండి సంబంధిత రైతులకు భూ పరిహారం 135 కోట్లు చెల్లించడం జరిగింది అని తెలిపారు. ఒక్క కేసు పెండింగ్ ఉన్నప్పటికీ కొన్ని విస్తరణ పనులకు అనుమతి తీసుకొని పని చేస్తున్నామని మిగతా వాటిని ఛేదించి అన్ని కేసులు క్లియర్ చేసుకొని రోడ్డు పూర్తి చేస్తాం.. ఈ ప్రాంతానికి సాగు నీరు లేకుండా చేసిన ప్రభుత్వం బిఆర్ ఎస్ ప్రభుత్వం. పదేళ్లుగా అధికారంలో ఉన్న బిఆర్ ఎస్ అభివృధి చేయలేదని వికారాబాద్ జిల్లాలో ఒక సంవత్సరంలోనే నేవీ రాడార్ పనులకు శంకుస్థాపన, వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ కు సర్వే లాంటి పెద్ద పనులకు శ్రీకారం చేపట్టామని తెలిపారు. ఇంకా ఈ ప్రాంతం అభివృద్ధి చేస్తామని తెలిపారు. అనంతరం చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ… రోడ్డు పనులను రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో పోయిన నెల 28 వ తేదీ నుంచి ప్రారంభించినా అనవసరంగా ప్రభుత్వం పై నిందలు మేడం కరెక్ట్ కాదు అన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed