దేశం సుభిక్షంగా ఉండాలంటే మోడీతోనే : కొండా

by Disha Web Desk 11 |
దేశం సుభిక్షంగా ఉండాలంటే మోడీతోనే : కొండా
X

దిశ, తాండూరు : దేశం సుభిక్షంగా ఉండాలంటే మోడీతోనే సాధ్యమని, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ ఎంపీలను గెలిపించి మరోసారి కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం తెచ్చుకోవాలని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కోరారు. మంగళవారం తాండూరు పట్టణం ఎంపీటీ హాల్లో బీజేపీ బూత్‌ కమిటీల సమావేశం, విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చేవెళ్ల బిజెపి ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు..

కేంద్ర ప్రభుత్వం నిధులతోనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. ఆర్టికల్ 370 ఎత్తివేయడంతో జమ్మూ కాశ్మీర్ లో శాంతి, ప్రగతి స్థాపించిన ఘనత మోడీదేనన్నారు. తాను క్యాష్ అండ్ క్యారీ నాయకుడిని కాదని, ప్రజా సంక్షేమం పట్ల కమిట్మెంట్ ఉన్న నాయకుడినన్నారు. చేవెళ్ల నుంచి తనను బీజేపీ ఎంపీగా గెలిపిస్తే కేంద్రంలో మూడోసారి రానున్న మోడీ బీజేపీ ప్రభుత్వం అండతో తాను నియోజకవర్గం అభివృద్ధికి ఎన్నో పనులు చేయగలనని, ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకొని తనను గెలిపించాలన్నారు.

255 గంటలు కష్టపడండి

బూత్ కమిటీలే పార్టీ కి పునాదులు అని, రానున్న 255 గంటలలో ప్రతి గడపను వీలైనన్ని సార్లు తట్టాలని కోరారు. సాధ్యం కానీ హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుంది. మందు, బిర్యానీల పంపిణియే కాంగ్రెస్ పార్టీ ఎజెండా అని, సి ఏ ఏ పథకాన్ని ముందుగా కాంగ్రెస్ పార్టీ నే తెచ్చిందని, బాబ్రీ మసీదును కూల్చింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని అన్నారు. కాంగ్రెస్ చేసిన తప్పులను బీజేపీ చేసిందని దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. గెలుపే లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేసి బీజేపీ పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, తాండూరులో బీజేపీ మొదటి స్థానంలో ఉంటే మూడవ స్థానానికి పరిమితమైనది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు నాగారం నర్సింలు, మనోహర్ రావు, బాలి శికుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, ఎంపీపీ బాలేశ్వర్ గుప్త. మాజీ కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, నాయకలు గాజుల శాంతుకుమార్, పటేల్ విజయ్ కుమార్, ఎంపీటీసీ పొయిరెడ్డి. బీరప్ప, బొప్పి శ్రీహరి, జిల్లా అధికారి ప్రతినిధి జుంటుపల్లి వెంకట్, వివిధ గ్రామాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed