- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే

దిశ, యాచారం : మండల కేంద్రంలో 58 లక్షలతో నూతనంగా నిర్మించిన గోదామును పిఎస్.సిఎస్ చైర్మన్ తోటిరెడ్డి రాజేందర్ రెడ్డి తో కలిసి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం గా ముందుకు వెళ్తున్నామని అన్నారు. రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం రైతులను నిండా ముంచిందని ఏనాడూ కూడా రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయలేదని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పల కుప్పగా మార్చిన రుణమాఫీ, రైతు భరోసా, నూతన రేషన్ కార్డులు, ఇద్దరమ్మా ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, సంక్షేమ పథకాలు అమలే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక స్థానాలు గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కొత్త కురుమ సత్తయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్ రెడ్డి, మాజీ ఎంపీపీ రాచర్ల వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీటీసీ జ్యోతి అరవింద్ నాయక్, డైరెక్టర్లు మధ్యల శశికళ, మక్కపల్లి స్వరూప, సీఈవో నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.