- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పురాతన దేవాలయాల అభివృద్ధికి కృషి: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దిశ, మహేశ్వరం: పురాతన దేవాలయాల అభివృద్ధికి చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం తుక్కుగూడ మున్సిపాలిటీలోని జన్నాయిగూడ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని పరిశీలించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ దేవాలయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారన్నారు. బ్రాహ్మణ సంక్షేమానికి పెద్దపేట వేశారన్నారు.
మహేశ్వరం నియోజకవర్గంలోని 8 పురాతన దేవాలయాలకు 8 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేస్తామన్నారు. దేవాలయాల్లో దూప, దీప, నైవేద్యాలు జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తుక్కుగూడ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ భవాని వెంకట్ రెడ్డి, కౌన్సిలర్లు రవి నాయక్, రెడ్డిగల్ల సుమన్, దేవాలయ చైర్మన్ శివకుమార్, బీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు లక్ష్మయ్య యాదవ్, యూత్ అధ్యక్షుడు సామెల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.