మాటల ప్రభుత్వాన్ని నమ్మి మరోసారి మోసపోకండి..

by Sumithra |   ( Updated:2023-06-04 17:26:09.0  )
మాటల ప్రభుత్వాన్ని నమ్మి మరోసారి మోసపోకండి..
X

దిశ, తలకొండపల్లి : తెలంగాణ రాష్ట్రంలో రెండుసార్లు మాయమాటలు మోసపూరిత వాగ్దానాలతో అధికారుల్లోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టవలసిన అవసరం ఆసన్నమైందని తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డోకూరు ప్రభాకర్ రెడ్డి అన్నారు. తలకొండపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహారాష్ట్ర ఏఐసీసీ కార్యదర్శి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి జన్మదిన వేడుకలను కార్యకర్తలు ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. బస్టాండ్ సమీపంలోని జన్మదిన వేడుక సందర్భంగా కేక్ కట్ చేసి రోగులకు ప్రజలకు పండ్లను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం గత 50 సంవత్సరాలుగా కష్టపడి సంపాదించిన ఆస్తులను మొత్తం నేటిప్రభుత్వాలు అమ్ముకొని లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, పేదల కోసం ఎల్లవేళలా పరితపిస్తుందని ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో ప్రాజెక్ట్లను, రైల్వే మార్గాలు, విమానాశ్రయాలను, పరిశ్రమలను స్థాపించి పెద్దపీట వేశారని గుర్తు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి ప్రాంతం నుండి వంశీచందర్ రెడ్డిని గెలిపిస్తే మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వంశీచందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కేంద్ర స్థాయిలో ముఖ్య నాయకునిగా తమ పాత్ర పోషిస్తున్నందుకు కల్వకుర్తిలో పూర్తిస్థాయిలో సమయం ఇవ్వలేకపోతున్నారని, కార్యకర్తలు అందరూ ఇది గమనించి ఎమ్మెల్యే వంశీ విజయం కోసం కష్టపడాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మోహన్ రెడ్డి, భగవాన్ రెడ్డి, జగన్, అంజయ్య గుప్తా, రవీందర్ యాదవ్, రాములు, అజీమ్, డేవిడ్, కృష్ణ, జనార్దన్ రెడ్డి, హరి, విష్ణు, రమేష్, చెన్నకేశవులు, తిరుపతిరెడ్డి, రామస్వామి గౌడ్, శేఖర్ రెడ్డి, అనిల్, భాస్కర్, మధుసూదన్ ,విష్ణు, లింగం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story