దిశ ఎఫెక్ట్​...రాయితీ గ్యాస్ వాడకంపై ఎస్ఓటీ దాడులు

by Sridhar Babu |
దిశ ఎఫెక్ట్​...రాయితీ గ్యాస్  వాడకంపై ఎస్ఓటీ దాడులు
X

దిశ, ఆమనగల్లు : ఆమనగల్లు పట్టణ కేంద్రంలోని పలు హోటల్ పై శనివారం ఎస్ఓటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ నెల 17న దిశ పత్రికలో రాయితీ గ్యాస్ పక్కదారి పేరిట ప్రచురితమైన వార్తకు ఎస్ఓటీ అధికారులు స్పందించారు. పట్టణ కేంద్రంలో హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లలో గృహ అవసర సిలిండర్లను వినియోగించడంతో గృహ వినియోగదారులకు సిలిండర్ సమస్య ఏర్పాటుంతుందని దిశలో ప్రచురితమైంది.

దాంతో ఎస్ఓటీ అధికారులు శనివారం ఆమనగల్లు పట్టణ కేంద్రంలో పలు హోటళ్లలో దాడులు నిర్వహించి ఏడు సిలిండర్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. ఈ సందర్బంగా అధికారులు మాట్లాడుతూ హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం కమర్షియల్ సిలిండర్లు మాత్రమే వాడాలని, రాయితీ సిలిండర్లు వాడితే సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed