- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తుంది.. భీం భరత్
దిశ, చేవెళ్ల : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయ ప్రారంభోత్సవంలో రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తుంది. రేవంత్ రెడ్డిని సీఎం చేద్దామని తెలంగాణ ప్రజలు చూస్తున్నారు అని చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పామేనా భీం భరత్ పేర్కొన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలో వికారాబాద్ రోడ్డులో బుధవారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అతిధులుగా పాల్గొన్ని దానిని ప్రారంభించి మండలంలోని మల్కాపూర్, తంగడ్పల్లి గ్రామాలలో నుంచి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన 200మందిని కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రములో కాంగ్రెస్ గాలి వీస్తుంది కనుకే బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జరుగుతున్నాయన్నారు. రేవంత్ రెడ్డిని సీఎం చేద్దామని తెలంగాణ ప్రజలు చూస్తున్నారు అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకుల పై దాడి చేస్తే సహించేది లేదన్నారు. నవాబ్ పెట్ మండలానికి చెందిన ఉపేందర్ రెడ్డి పై యాదయ్య అనుచరులు దాడి చేయడం సరికాదున్నారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని వికారాబాద్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. నియోజకవర్గ ప్రజలు యాదయ్య ఒక పది సంవత్సరాలు, రత్నంకు జిల్లా చైర్పర్సన్ గా ఒకసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. అతను కూడా ఒక సారి అవకాశం ఇవ్వాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో చింపుల సత్యనారాయణ రెడ్డి, శైలజ ఆగిరెడ్డి, దేవర సమతా వెంకట్ రెడ్డి, సరిత ప్రతాప్ రెడ్డి, జనర్దన్ రెడ్డి, సురేందర్ రెడ్డి, ఆగిరెడ్డి, దేవర వెంకట్ రెడ్డి, మధుసూదన్ గుప్తా, ప్రతాప్ రెడ్డి, పెంటయ్య గౌడ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.