క్రీడాకారులను ప్రోత్సహించేందుకే ‘సీఎం కప్’ : ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి

by Kalyani |
క్రీడాకారులను ప్రోత్సహించేందుకే ‘సీఎం కప్’ : ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి
X

దిశ, పరిగి: గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించేందుకే సీఎం కప్ పేరిట క్రీడలను నిర్వహిస్తున్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. పరిగిలో బుధవారం సీఎం కప్ ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడల్లో రాణించగలిగితే భవిష్యత్ లో మంచి అవకాశాలు లభిస్తాయన్నారు. అనంతరం కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ తదితర క్రీడా పోటీలను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి హనుమంతరావు, ఎంపీపీ కరుణ అరవిందరావు, ఏఎంసీ చైర్మన్ అంతిగారి సురేందర్ కుమార్, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, నాయకులు బ్రతుకు ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎంపీడీవో శేషగిరి శర్మ, ఎంఈఓ హరిచందర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story