డెంగ్యూ వ్యాధితో బాలుడి మృతి

by Nagam Mallesh |
డెంగ్యూ వ్యాధితో బాలుడి మృతి
X

దిశా, శంకర్పల్లిః డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ ఓ బాలుడు మృతి చెందిన ఘటన శంకరపల్లి మండలం టంగుటూరు గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అబ్బగోని మహేష్ గౌడ్ కుమారుడు గౌతమ్ సాయి (10) నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడ్డాడు. వైద్యం కోసం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఆసుపత్రికి తరలిస్తుండగా బాలుడు మృతి చెందినట్లు తెలిపారు. బాలుడు మృతి పట్ల గ్రామంలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి. శంకర్ పల్లిలోని నారాయణ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు.

Advertisement

Next Story