- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రంగరాజన్ ను పరామర్శించిన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్

దిశ, మొయినాబాద్ : గొప్ప విశ్వాసాలతో వర్ధిల్లు దేశం భారతదేశం అని సర్వేజనా సుఖినోభవంతు అని కోరుకునే దేశం మనది అని అలాంటి దేశంలో అర్చకులపై దాడి చేయడం అమానుషమని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులు రంగరాజన్ పైన దాడి జరిగిన విషయాన్ని తెలుసుకుని ఆయన చిలుకూరి బాలాజీ దేవస్థానం కు చేరుకొని ఆయన పరామర్శించారు. సందర్భంగా మాట్లాడుతూ… 500 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ దేవాలయ సన్నిధిలో దాడులు చేయడం మన సంస్కృతి కాదు అని ఈ దాడిని సభ్యసమాజం సహించబోదని ఆయన అన్నారు.
ప్రభుత్వం పోలీసులు వ్యవస్థ ఇటువంటి దాడులు మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు నిందుతుల పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాల్లో ఇలాంటి దాడులు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అని మండిపడ్డారు. చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించి ఇలాంటి దాడులు మరెవ్వరూ చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన డిమాండ్ చేశారు. బహిరంగ సభలలో నోటికి వచ్చినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే కె.ఎస్ రత్నం, జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి, జిల్లా నాయకులు, మండల నాయకులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.