అంగన్వాడీ సెంటర్‌లో నాసిరకం ఆహారం.. అస్వస్థతకు గురైన బాలుడు

by Disha Web Desk 23 |
అంగన్వాడీ సెంటర్‌లో నాసిరకం ఆహారం.. అస్వస్థతకు గురైన బాలుడు
X

దిశ,యాలాల: అంగన్వాడీ సెంటర్లలో పిల్లలకు, బాలింతలకు క్వాలిటీ ఫుడ్ అందజేస్తున్నామని ఆఫీసర్లు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పురుగులు పట్టిన బియ్యం,ఎక్స్పైర్ అయిన కందిపప్పు, కల్తీ కారం, వాడుతుండటంతో చిన్నారులు అవస్థతకు గురవుతున్నారు. క్వాలిటీ ఆహారాన్ని ఇవ్వాలని ఆఫీసర్లు చెబుతున్న అంగన్వాడి సెంటర్ల నిర్వాహకులు మాత్రం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

యాలాల మండలం ముకుందాపూర్ గ్రామంలో పురుగులు పట్టిన కందిపప్పుతో అంగన్వాడి సెంటర్ లో నాసిరకం ఫుడ్ అందజేస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన సాయి వర్ధన్ అనే బాలుడు అంగన్వాడి సెంటర్ లో కల్తీ ఫుడ్ తినడం వల్ల అస్వస్థతకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం సరఫరా చేసే పౌష్టికాహారాన్ని పాలను బయట మార్కెట్లో అమ్ముకొని క్వాలిటీ లేని సరుకులను తెచ్చి చిన్నారులకు వండి పెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Next Story

Most Viewed