మిషన్ కాకతీయతో చెరువులకు జలకళ: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

by Kalyani |
మిషన్ కాకతీయతో చెరువులకు జలకళ: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
X

దిశ, మహేశ్వరం: మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్లో పూడికతీత తీయడం వల్ల చెరువులకు జలకళ సంతరించుకుందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బుధవారం మహేశ్వరం మండల కేంద్రంలో పోతర్ల బాబయ్య ఫంక్షన్ హాల్లో సాగునీటి దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని, అనంతరం మహేశ్వరం మెట్ల బావికి రూ. 90 లక్షల నిధులతో పునరుద్దరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టులా పాలమూరు రంగారెడ్డిని పూర్తిచేసి రంగారెడ్డి జిల్లాకు సాగు, తాగు నీరును తీసుకొస్తామన్నారు.

మహేశ్వరం నియోజకవర్గంలో ప్రాచీన వారసత్వ కట్టడాలను కాపాడుతూ వాటిని భవిష్యత్ తరాలకు అందించాలని పునరుద్ధరీకరణ పనులను చేపడుతున్నట్లు తెలిపారు. మహేశ్వరం మెట్లబావికి రూ. 90 లక్షల నిధులతో సుందరీకరణ పనులు చేపడుతున్నమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దయానంద్, ఎంపీపీ రఘుమా రెడ్డి, వైస్ ఎంపీపీ సునీత ఆంధ్యా నాయక్, కందుకూరు జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ రెడ్డి, పలు శాఖల అధికారులు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజు నాయక్, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed