- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మందుబాబుల వీరంగం.. ఆలయ కమిటీ సభ్యులపై సీసాలతో దాడి
దిశ, గండిపేట్: ఆలయ కమిటీ సభ్యులపై మందుబాబులు సీసాలతో దాడికి పాల్పడిన ఘటన మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పుప్పాగూడలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం వద్ద చింతల్ బస్తీకి చెందిన కొందరు కూర్చొని మందు సేవిస్తున్నారు. ఈ క్రమంలోనే అటుగా వచ్చిన ఆలయ కమిటీ సభ్యులు ఆలయ పరిసరాల్లో తాగొద్దని, వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మందుబాబులు తాగొద్దని చెప్పేందుకు మీరెవరంటూ వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఉప్పలగూడకు చెందిన జి.శ్రీనివాస్, బి.కిరణ్, రాములు, గోపాల్, షేక్‌పేట్ చెందిన చెందిన శ్రీనివాసులుపై విచక్షణారహితంగా దాడి చేశారు. గతంలోనూ అనంత పద్మనాభ స్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో మద్యం, మత్తు పానీయాలు సేవిస్తున్నారని ‘దిశ’ పత్రికలో వార్తలు వచ్చాయి. అయినా ఈ విషయాన్ని పోలీసు అధికారులు కనీసం పట్టించుకోకపోవడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.