- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిల్లర నోకెస్తున్న పోస్ట్ మ్యాన్..! పింఛన్ లబ్ధిదారుల ఆరోపణ
దిశ, మహేశ్వరం: ప్రభుత్వం ప్రతి నెల వృద్ధులకు, వితంతువులకు 2,016 రూపాయలు, వికలాంగులకు 3,016 రూపాయల పెన్షన్ పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కానీ గ్రామాలలో క్షేత్ర స్థాయిలో పోస్టు మ్యాన్‌లు ఫించన్ లబ్ధిదారులకు 2,000, 3,000 రూపాయలు ఇచ్చి, చిల్లర 16 రూపాయలను తన జేబులో వేసుకుంటున్నారని పెన్షన్ లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. మహేశ్వరం మండలం లోని కోళ్ల పడకల్, అమీర్ పేట్, నాగారం, తుమ్మలూరు, మాణిక్యమ్మ గూడ, కల్వకోల్, మొహబ్బత్ నగర్, సుభాన్ పూర్ గ్రామలతోపాటు మండలంలోని పలు గ్రామాలలో పోస్ట్ మ్యాన్‌లో చిల్లర 16 రూపాయలను తన జేబులో నింపుకుంటున్నరాన్ని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ ఎవరైనా లబ్దిదారుడు చిల్లర ఎందుకు ఇవ్వడం లేదని పోస్టు మ్యాన్‌ని నిలదీస్తే చిల్లర డబ్బులు లేవని.. నీ దగ్గర చిల్లర డబ్బులు ఉంటే తీసుకుని రా.. లేకపోతే నేను ఇచ్చిన డబ్బులే తీసుకొని పోవాలంటున్నారాన్ని.. పింఛన్ లబ్ధిదారులు వాపోతున్నారు.
మా గ్రామంలో పోస్ట్ మ్యాన్ మాకు పింఛన్ డబ్బులు 2,000 రూపాయలు మాత్రమే ఇస్తాడు. మిగిలిన చిల్లర 16 రూపాయలు పోస్టు మ్యాన్‌ను అడుగుతే చిల్లర లేవని, మీ ఊరికి వచ్చి పింఛన్ ఇస్తున్నందుకు ప్రతి నెల 16 రూపాయలు తీసుకుంటున్న అని కేటవాత్ రుకాలి (పింఛను లబ్ధిదారుని) చెబుతున్నారు. చిల్లర 16 రూపాయలు ఇచ్చేలా అధికారులు చొరవ చూపాలి. ఇదే విషయంపై మహేశ్వరం ఎంపీడీఓ స్పందించాడు. గతంలో ఘట్టుపల్లి గ్రామంలో పోస్ట్ మ్యాన్ చిల్లర 16 రూపాయలు ఇవ్వడం లేదని మా దృష్టికి వచ్చింది. వారిపై ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. మండలంలో ఫించన్ లబ్ధిదారులకు చిల్లర 16 రూపాయలు ఇవ్వని పోస్టు మ్యాన్‌లపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.