దేవతను కూడా వదలని దొంగలు

by Sumithra |
దేవతను కూడా వదలని దొంగలు
X

దిశ, యాచారం : మండలంలోని తాడిపర్తి గ్రామంలో కొలువైన తాటికుంట మైసమ్మ దేవాలయంలో గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు అమ్మవారి విగ్రహం అపహారించినట్టు ఆ గ్రామ సర్పంచ్ దూస రమేష్ పేర్కొన్నారు.విషయం తెలుసుకున్న యాచారం పోలీసులు తాటి కుంట మైసమ్మ దేవాలయాన్ని సందర్శించారు.

దేవాలయంలోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసి హుండీ , అమ్మవారి విగ్రహాన్ని అపహరించారు. గతంలో కూడా అమ్మవారి హుండీని ఎత్తుకెళ్లారని స్థానికులు తెలిపారు. తక్షణమే అధికారులు స్పందించి విగ్రహాన్ని దొంగిలించిన దుండగులను పట్టుకోవాలని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story