ప్రేమించానని చెప్పి గర్భవతిని చేసి.. ప్లేట్ పిరాయించిన యువకుడు

by Hamsa |
ప్రేమించానని చెప్పి గర్భవతిని చేసి.. ప్లేట్ పిరాయించిన యువకుడు
X

దిశ, శంకర్పల్లి : మాయ మాటలు చెప్పి అమ్మాయిని మోసం చేశాడు. ప్రేమించాను .. పెళ్లి చేసుకుంటానని కబుర్లు చెప్పి అమ్మాయిని గర్భవతిని చేశాడు. పెళ్లి కాకుండానే అమ్మాయి పండంటి మగ బిడ్డకు జన్మనివ్వడం తో ప్లేట్ పిరాయించాడు .. ఆ మాయల మరాఠీ.

వివరాలు ఇలా ఉన్నాయి.. శంకర్పల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి తన తల్లితో కలిసి నాలుగు సంవత్సరాల నుంచి శంకర్పల్లి శ్రీరాంనగర్ కాలనీలోని అద్దెకు ఉంటుంది. అమ్మాయి నార్సింగ్ పరిధిలోని శ్రీదేవి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నది. కాగా ఇంటి ఓనర్ కొడుకు కార్తీక్ రెడ్డి ప్రేమిస్తున్నానంటూ యువతి వెంటపడ్డాడు. మాయమాటలు చెప్పి యువ తిని లోబరుచుకున్నాడు. కడుపు నొస్తుందని అమ్మాయి చెప్పడంతో తల్లి ఈనెల 26న శంకర్పల్లి లోని గాయత్రి ఆస్పత్రికి తీసుకెళ్లింది. డాక్టర్లు పరీక్షలు చేసి మీ అమ్మాయి గర్భవతి అని చెప్పడంతో తల్లి నోట మాట రాలేదు. నొప్పులు ఎక్కువ కావడంతో అదే రోజు డాక్టర్లు కాన్పు చేయగా అమ్మాయి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి చేసుకోవాలని అమ్మాయి కార్తీక్ రెడ్డిని కోరగా, అతను ఒప్పుకోకపోవడంతో అమ్మాయి పోలీస్ స్టేషన్ లో మంగళవారం రోజున ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కార్తీక్ రెడ్డి పై రేప్, మోసం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా ఆ బిడ్డకు తాను తండ్రిని కాదని కావాలంటే డిఎన్ఏ టెస్ట్ చేసుకోవచ్చని తాను ఏ తప్పు చేయలేదని కార్తీక్ రెడ్డి కరాకండిగా చెప్పడం కొసమెరుపు

Advertisement

Next Story