- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బడంగ్ పేట్ లో విషాదం.. లోన్ యాప్స్ వేధింపులకు ఒకరు బలి
దిశ, బడంగ్పేట్ : లోన్ యాప్స్ వేధింపులు భరించలేక ఓ ప్రభుత్వ ఉద్యోగి సెల్పీ వీడియో తీసుకుని జల్పల్లి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పహాడిషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. చెరువు సమీపంలో బైక్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు అతని కోసం జల్పల్లి చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. పహాడిషరీఫ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మలక్‌పేట్ కాల డేరా ప్రాంతానికి చెందిన మహ్మద్ అబ్దుల్ ఖయ్యూమ్ కుమారుడు అబ్దుల్ నవీద్ (41) మింట్ కంపౌండ్‌లో రికార్డ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
అబ్దుల్ నవీద్‌కు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అబ్దుల్ నవీద్ లోన్ యాప్స్ ద్వారా లోన్ లు, పలువురి దగ్గర చేతి బదులుగా డబ్బులు తీసుకున్నాడు. తీసుకున్న లోన్స్‌కు డబ్బులు చెల్లించలేని పరిస్థితి ఎదురవడంతో లోన్ యాప్స్ వాళ్ళ నుంచి ఒత్తిడి తీవ్ర తరమయ్యింది. దీంతో సోమవారం ఉదయం 10.45గంటలకు డ్యూటికని ఇంట్లో చెప్పి జల్పల్లి చెరువు ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ సెల్ఫీ వీడియోలో తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి కుటుంబసభ్యులకు పంపించాడు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు అబ్దుల్ నవీద్‌కు ఫోన్ చేసినా స్పందించలేదు.
దీంతో అతని కుటుంబ సభ్యులు చాదర్ ఘాట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చాదర్‌ఘాట్ పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు. ఇదిలా ఉండగా కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం కూడా అబ్దుల్ నవీద్‌కు కంటిన్యూగా ఫోన్లు చేస్తున్నారు. జల్ పల్లి చెరువు ప్రాంతంలో ఓ బైక్ నుంచి మొబైల్ రింగ్ టోన్ శబ్దం రావడాన్ని గమనించిన స్థానిక మహిళ కాల్‌ను రిసీవ్ చేసుకుంది. జల్ పల్లి చెరువు పక్కన ఓ బైక్‌లో ఈ ఫోన్ ఉందని, ఇక్కడ ఎవరు కనిపించడం లేదని సదరు మహిళ ఫోన్లో చెప్పింది. వెంటనే కుటుంబ సభ్యులు పహాడి షరీఫ్ పోలీసులకు సమాచారం అందించారు.
హుటాహూటిన ఘటనా స్థలికి చేరుకున్న పహాడిషరీఫ్ పోలీసులు బైక్‌ను, సెల్‌ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెల్ఫీ వీడియో సోమవారం రోజున ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పహాడిషరీఫ్ పోలీసులు గజ ఈత గాళ్ళను రప్పించి, జల్పల్లి చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదు. అబ్దుల్ నవీద్ ఇంతకు సెల్ఫీ వీడియో తీసుకుని జల్పల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా అనే కోణాల్లోను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసును పహాడీషరీఫ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.