పహల్గామ్ లో మతం పేరుతో ఉగ్రదాడి.. ఉగ్రదాడి బాధితుడి సంచలన నిర్ణయం

by Ramesh Goud |
పహల్గామ్ లో మతం పేరుతో ఉగ్రదాడి.. ఉగ్రదాడి బాధితుడి సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: పహల్గామ్ (Pahalgam) లో మతం పేరుతో ఉగ్రదాడి జరిగిందని చెబుతూ.. ఉగ్రదాడి బాధితుడు (Terror Attack Victim) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. జమ్మూ కాశ్మీర్ (Jammu Kashmir)లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేగాక ఈ దాడిలో చాలామంది గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడిలో ఉగ్రమూకలు మతం పేరు అడిగి మరీ ఓ వర్గానికి చెందిన వారినే హతమార్చారని ప్రత్యక్ష సాక్షులు (Eyewitnesses) తెలిపారు. దీంతో దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.

అయితే మతం పేరుతో జరిగిన ఈ చర్యపై నిరసనగా ఉగ్రదాడి బాధితుడు సబీర్ హుస్సేన్ (Sabir Hussain) తన మతాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. బైసరన్ పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో బదురియాకు చెందిన సబీర్ హుస్సేన్ కూడా గాయపడ్డారు. ఇస్లాం పేరు చెప్పి జరిపిన ఈ చర్య సరైనది కాదంటూ ఇస్లాంను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు కోర్టును ఆశ్రయించాడు. దీనిపై సబీర్ హుస్సేన్ మాట్లాడుతూ.. హింసను వ్యాప్తి చేయడానికి మతాన్ని పదే పదే ఉపయోగిస్తున్నారని, ఇది సరైన పద్దతి కాదని అన్నారు. అంతేగాక తాను ఏ మతాన్ని అగౌరవపరచడం లేదని, ఇది నా వ్యక్తిగత నిర్ణయం అని చెప్పారు. హింసను వ్యాప్తి చేయడానికి మతాన్ని ఆయుధంగా ఎలా ఉపయోగిస్తారో స్పష్టంగా చూశానని, కాశ్మీర్ లో ఇది చాలా సార్లు జరిగిందని, ఇకపై తాను దీన్ని సహించనని సబీర్ అన్నారు.



Next Story

Most Viewed