విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు..

by Sumithra |
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు..
X

దిశ, నవాబ్ పేట్ : మూడు సంవత్సరాల నుండి నీరు పోసి పెద్ద చేసిన మొక్కలను అగ్నికి ఆహుతి చేశారు. పంచాయతీ కార్యదర్శి ఫీల్డ్ అసిస్టెంట్ నిర్లక్ష్యం కారణంగా పల్లెప్రకృతి వనంలో 50 మొక్కల వరకు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు మూడు సంవత్సరాల నుండి వాటిని కాపాడుకుంటూ పెంచి పెద్ద చేశామంటూ సర్పంచ్ చెప్పుకొస్తున్నారు. కనీసం సర్పంచ్ కు గాని, పంచాయతీ కార్యదర్శికి గాని సమాచారం ఇవ్వకుండా ఫీల్డ్ అసిస్టెంట్ ప్రకృతి వనంలో కూలీలను పెట్టి పని చేయించడం ఏంటని పాలకవర్గం పంచాయతీ కార్యదర్శి డిఆర్డీవో అధికారికి చెప్పుకువచ్చారు.

అగ్నికి ఆహుతైన మొక్కలను శనివారం వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ మండలం ఆర్కతల గ్రామంలోని పల్లెపకృతి వనం నర్సరీని డిఆర్డిఓ కృష్ణన్ పరిశీలించారు. అదేవిధంగా పల్లె ప్రకృతి వనంలో చిందర వందరగా గడ్డిగాళం పెరగడం పై ఫీల్డ్ అసిస్టెంట్ జనార్దన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి తెలియకుండా ఎలా కూలీలను పెట్టి పనిచేయిస్తున్నారని డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తారని ప్రశ్నించారు. పల్లె ప్రకృతి వనాల మెంటెనెన్స్ రెండు సంవత్సరాలు పూర్తి అయింది మరి ఇప్పుడు కూలీలను పెట్టి డబ్బులు ఎలా ఇస్తావు నీ జేబులో నుంచి ఇస్తావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస సమాచారం లేకుండా ఇష్టానుసారంగా విధులు నిర్వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

పల్లె ప్రకృతి వనం మొత్తం చిందరవందరగా ఉందని కనీసం దీనిమెంటెనెన్స్ సరిగా లేదని అన్నారు. గడ్డి కోయమంటే చెట్లను కాల్చివేయడం జరిగిందని పీల్డ్ అసిస్టెంట్ జనార్దన్ చెప్పుకొస్తున్నారు. గడ్డికోసే అప్పుడు నీవు పక్కనే ఉండాలి కదా గడ్డి కోసే యంత్రం ఉండగా కూలీలను పెట్టి ఎందుకు పని చేయించావని ప్రశ్నించారు. దీనిపై ఎలాంటి స్పందన ఇవ్వని ఫీల్డ్ అసిస్టెంట్. అగ్నికి ఆహుతైన 50 మొక్కల స్థానంలో వెంటనే వేరే మొక్కలు రీప్లేస్మెంట్ చేయాలని ఆదేశించారు. గడ్డి మిషన్ కొని రెండు నెలలు అయినా గడ్డి ఎందుకు కోయలేదు. గడ్డి మిషన్ ఉండి ఉపయోగించక పోవడం ఏంది. అసలు గడ్డి కోయడానికి మనుషులను ఎందుకు వాడారు.

కొంచం బుర్రను ఉపయోగించి బాధ్యతగా పనిచేయండని పంచాయతీ కార్యదర్శి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం నర్సరీలోని మొక్కలను పరిశీలించి మొక్కలను పెంచుతున్నారా లేదా పాడుచేస్తున్నారా అని పంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్ పై మండిపడ్డారు. ఉపాధి హామీ కూలీలతో ఎందుకు పనిచేయించడం లేదని ప్రశ్నించారు. వారం రోజుల్లో మళ్ళీ వస్తానని కాలిపోయిన మొక్కల స్థానంలో మొత్తం మార్చి వేరే మొక్కలు పెట్టించి, నర్సరీ కూడా సెట్ చేయించాలని పంచాయతీ కార్యదర్శిని, ఫీల్డ్ అసిస్టెంట్ ని ఆదేశించారు. విధులపట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని బాధ్యతగా విధులు నిర్వహించాలని హెచ్చరించారు. డీఆర్డీఓ కృష్ణన్ వెంట ఎంపీఓ విజయ్ కుమార్, సర్పంచ్ వడ్డె రాములు, ఇంచార్జ్ ఏపీవో జ్యోతి, పంచాయతీ కార్యదర్శిని, టీఏలు, ఫీల్డ్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed