తెలంగాణలో రంగారెడ్డి టాప్.. చివరి స్థానం ఆ జిల్లాదే

by Gantepaka Srikanth |   ( Updated:2025-03-19 16:27:38.0  )
తెలంగాణలో రంగారెడ్డి టాప్.. చివరి స్థానం ఆ జిల్లాదే
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రం 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాల వారీగా స్థూల జిల్లా జీడీపీ (GDDP) గణాంకాలను విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో అత్యధిక స్థూల జీడీపీ కలిగిన జిల్లాగా రంగారెడ్డి నిలిచింది. రంగారెడ్డి జిల్లా రూ.3,17,988 కోట్ల జీడీపీతో టాప్ ప్లేసు సాధించింది. హైదరాబాద్ రూ.2,75,490 కోట్లతో రెండో స్థానంలో, మేడ్చల్-మల్కాజిగిరి రూ.2,64,190 కోట్లతో మూడో స్థానంలో నిలిచాయి. నల్గొండ, సంగారెడ్డి, ఖమ్మం జిల్లాలు అత్యధిక ఆర్థిక విలువ కలిగిన జిల్లాలుగా నిలిచాయి. అయితే.. ములుగు జిల్లా మాత్రం రూ.8,873 కోట్లతో జీడీపీ పరంగా చివరి స్థానంలో ఉంది. జయశంకర్ భూపాలపల్లి రూ.13,902 కోట్లు, కుమ్రంభీం ఆసిఫాబాద్ రూ.13,930 కోట్లతో ములుగుకు సమీపంలో ఉన్నాయి.



Next Story

Most Viewed