టెక్ట్స్‌బుక్స్‌లో రామాయణం.. NCERT కీలక ప్రతిపాదన

by Sathputhe Rajesh |   ( Updated:2023-11-21 05:34:07.0  )
టెక్ట్స్‌బుక్స్‌లో రామాయణం.. NCERT కీలక ప్రతిపాదన
X

దిశ, వెబ్‌డెస్క్: రామాయణం, మహాభారత కావ్యాలను పాఠశాల విద్య స్థాయి టెక్ట్స్ బుక్స్‌లో చేర్చాలని నేషనల్ కౌన్సిల్ ఎడ్యూకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) ప్రతిపాదించింది. దీంతో పాటు పాఠశాల తరగతి గదుల్లో రాజ్యాంగంలోని ప్రియాంబుల్స్ ను వివిధ భాషల్లో రాయాలని కమిటీ చైర్మన్ ప్రొ. ఇసాక్ తెలిపారు. భారత దేశ ప్రతిభ, వేదాలు, ఆయుర్వేదానికి సంబంధించిన కీలక అంశాలను పాఠశాల సిలబస్ లో చేర్చాలని కమిటీ ప్రపోజ్ చేసింది.

ఈ ప్రక్రియ చివరి దశలో ఉన్నట్లు ఎన్సీఈఆర్టీ తెలిపింది. క్లాసికల్ పిరియడ్, మధ్యయుగం, బ్రిటిష్ ఎరా, మోడర్న్ ఇండియా అనే నాలుగు భాగాలుగా చరిత్రను ఈ కమిటీ ప్యానెల్ విభజించింది. విద్యార్థి దశలోనే రామాయణం, మహాభారతంపై స్టూడెంట్స్ కు అవగాహన కల్పించేందుకు కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సిలబస్‌కు సంబంధించి కసరత్తు కొనసాగుతున్నట్లు కమిటీ పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed