- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బండి సంజయ్ వ్యక్తి కాదు ఓ శక్తి: ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

X
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశంసలు కురిపించారు. కరీంనగర్ బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలతో కలిసి భారీగా ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాజాసింగ్ మాట్లాడుతూ.. బండి సంజయ్ వ్యక్తి కాదు శక్తి అని కొనియాడారు. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి దమ్ముంటే బండి సంజయ్‌పై అభ్యర్థిని నిలబెట్టాలని సవాల్ విసిరారు. డబ్బులు ముఖ్యమా.. ధర్మం ముఖ్యమా కరీంనగర్ ప్రజలు ఆలోచించాలని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్‌ని భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు.
Next Story