- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూపీ సీఎం తరహాలో క్రైమ్‌ని కంట్రోల్ చేయాలి: సీఎం రేవంత్ రెడ్డికి రాజాసింగ్ రిక్వెస్ట్
దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా లాంటి ఇతర రాష్ట్రాల నుంచి చాలా పెద్ద ఎత్తున తెలంగాణకు డ్రగ్స్ సప్లై అవుతోందని బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఓ వీడియో విడుదల చేశారు. ఎక్కువ శాతం డ్రగ్స్ ఉపయోగించేది పబ్‌లో అని చెప్పారు. నగరంలోని దాదాపు అన్ని పబ్బుల్లో డ్రగ్స్ సప్లై అవుతుందని, ఈ క్రమంలోనే యువత డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నారని అన్నారు. ఇటీవల మెగస్టార్ చిరంజీవి డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఓ వీడియో చేశారని గుర్తుచేశారు. అదే విధంగా డ్రగ్స్ కంట్రోల్ చేయాలని ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క హీరో, హీరోయిన్లు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
డ్రగ్స్ కంట్రోల్ కావాలని తెలంగాణ ప్రభుత్వం కూడా యాంటీ నార్కోటిక్ టీమ్ కూడా ఏర్పాటు చేసిందన్నారు. పార్టీలను పక్కన పెట్టి.. యువతను కాపాడాలన్నారు. ఎవరన్నా పబ్‌లో కానీ, బయట కానీ డ్రగ్స్ విక్రయించేవాడు దొరికితే.. వారిపై కేసులు పెట్టొద్దని, ఉత్తరప్రదేశ్‌లో ఏవిధంగా సీఎం యోగీ ఆదిత్యనాథ్ క్రైమ్‌ని కంట్రోల్ చేస్తున్నారో దృష్టిపెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేశారు. భయం లేకపోతే ఎవరూ కూడా డ్రగ్స్ అమ్మడం మానరని చెప్పారు.