- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాహుల్ గాంధీ వద్ద మార్కులు కొట్టేసిన సీఎం రేవంత్ రెడ్డి! ఎందుకో తెలుసా?
దిశ, డైనమిక్ బ్యూరో: భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో సీఎంగా హేమంత్ సోరెన్ రాజీనామా తర్వాత రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిరిగాయి. ఆయన రాజీనామా అనంతరం చంపయ్ సోరెన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో బీజేపీ ఆపరేషన్ లోటస్‌పై ఆందోళన నేపథ్యంలో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమికి చెందిన ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించారు.
టీ కాంగ్రెస్ టాస్క్ కంప్లీట్!
తెలంగాణ కాంగ్రెస్ నేతలను నమ్మి అధిష్టానం ఎమ్మెల్యేలను హైదరాబాద్ పంపించింది. దీంతో అధికార జేఎంఎం నేతృత్వంలో దాదాపు 40 మంది సంకీర్ణ ఎమ్మెల్యేలను రాంచీ నుంచి హైదరాబాద్ శామీర్‌పేటలోని ఓ రిస్టార్ట్‌కు తరలించారు. మూడు రోజులు ఇక్కడే వారిని టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో రిసార్ట్‌లో చూసుకున్నారు. తర్వాత ఆదివారం మధ్యాహ్నం వారిని తిరిగి రాంచి పంపించారు. అయితే నేడు చంపయ్ సోరెన్ ప్రభుత్వానికి నేడు విశ్వాస పరీక్ష జరిగింది. జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గింది. 47 మంది ఎమ్మెల్యేల మద్దతుతో సీఎం చంపాయ్ సోరెన్ ఆధ్వర్యంలోని జార్ఖండ్ ప్రభుత్వం బలపరీక్షలో విజయం సాధించగా.. 29 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు.
కలిసొచ్చిన హైదరాబాద్ రిసార్ట్ పాలిటిక్స్
బలపరీక్ష నెగ్గడంతో కాంగ్రెస్ అధిష్టానం పెట్టుకున్న నమ్మకంతో తెలంగాణ కాంగ్రెస్‌కు ఇచ్చిన టాక్స్ సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ అయ్యింది. హైదరాబాద్ రిసార్ట్స్ పాలిటిక్స్ కలిసివచ్చాయని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేశారని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ఇవాళ జార్ఖండ్ రాష్టంలో జరుగుతున్న ఆయన జోడో న్యాయ్ సభలో పాల్గొన్నారు.
భారత్ జోడో న్యాయ్ యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి
జార్ఖండ్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట విమానాశ్రయం నుంచి జార్ఖండ్ లోని రాంచీ వెళ్లారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ ఉన్నారని సమాచారం.