- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rahul Gandhi: కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో: రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
X
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి జూపల్లి భేటీ ముగిసింది. సోమవారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో అర్థగంటకు పైగా పొంగులేటి, జూపల్లితో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జూలై 2వ తేదీన ఖమ్మం జిల్లాలో జరిగే సభకు రావాలని పొంగులేటి రాహుల్ గాంధీని ఆహ్వానించగా.. దీనికి ఆయన సానూకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను విడిచి వెళ్లిన నేతలంతా తిరిగి పార్టీలోకి రావడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఘర్ వాపసీ జరుగుతోందని పేర్కొన్నారు. తెలంగాణలో కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో అనే నినాదంతో నేతలంతా ముందు కెళ్లాలని ఈ సందర్భంగా నేతలకు రాహుల్ గాంధీ సూచించారు.
Advertisement
Next Story