CSK ఆలౌట్.. SRH ఎదుట ఈజీ టార్గెట్

by Gantepaka Srikanth |   ( Updated:2025-04-25 16:02:01.0  )
CSK ఆలౌట్.. SRH ఎదుట ఈజీ టార్గెట్
X

దిశ, వెబ్‌డెస్క్: చెన్నైలోని చిదంబరం మైదానం(Chidambaram Stadium) వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్‌(Sunrisers Hyderabad) జట్టుతో జరుగుతోన్న మ్యాచ్‌లో చెన్నై(Chennai Super Kings) బ్యాటర్లు తడబడ్డారు. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో కీలక బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేశారు. ఆయుష్ (30), బ్రేవీస్ (41), దీపక్ హుడా (22), రవీంద్ర జడేజా (21) పరుగులతో రాణించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించారు. మొత్తంగా 19.5 ఓవర్లలో 154 పరుగులు చేసి చెన్నై ఆలౌటైంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించాలంటే 155 పరుగులు చేయాలి. SRH బౌలర్లలో హర్షల్ పటేల్ 4 వికెట్లు, కెప్టెన్ పాట్ కమ్మిన్స్, ఉనద్కత్ రెండేసి వికెట్లు, షమీ, మెండీస్ తలో వికెట్ తీశారు.

కాగా, ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండు జట్లు సేమ్ పొజీషన్‌లో ఉన్నాయి. ఇప్పటివరకు రెండు జట్లు చెరో ఎనిమిది మ్యాచులు ఆడగా.. రెండూ రెండేసి మ్యాచులు గెలిచి.. మిగిలిన ఆరు మ్యాచుల్లో ఓడిపోయాయి. ఇది రెండు జట్లకు కీలకమైన మ్యాచ్. ఇందులో ఓడిన జట్టు ఇంటిబాట పట్టనుంది. గెలిచిన జట్టు.. వరుసగా అన్నింట్లోనూ విజయం సాధిస్తేనే ప్లేఆఫ్స్‌కు వెళ్లే అవకాశం ఉంది. ఒక్కటి ఓడినా ఆ జట్టు సైతం ఇంటికే రానుంది.



Next Story

Most Viewed