- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘ఐపీఎల్’ అభిమానులకు బిగ్ అలర్ట్.. ఉప్పల్ స్టేడియంలో ఇవి నిషేధం.. రాచకొండ పోలీస్

దిశ, డైనమిక్ బ్యూరో: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మరి కొద్ది రోజుల్లో మార్చి 22న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సారి కూడా ట్రోఫీ కోసం 10 జట్లు పోటీ పడుతున్నాయి. హైదరాబాద్‌లోని (Uppal Stadium) ఉప్పల్ స్టేడియంలో సైతం ఐపీఎస్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలోనే (Rachakonda Police) రాచకొండ పోలీసులు ఐపీఎల్ అభిమానులకు కీలక సూచనలు జారీ చేశారు. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో కొన్ని వస్తువులు నిషేధించినట్లు నోటిసుల్లో పేర్కొన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా స్టేడియంలోకి కొన్ని రకాల వస్తువులను (prohibited items) నిషేధించారు.
వాటిలో ల్యాప్‌టాప్, సెల్ఫీ స్టిక్‌లు, వాటర్ బాటిళ్లు, ఆల్కహాల్, కూల్‌డ్రింక్స్, కెమెరాలు, సిగరెట్లు, అగ్గిపెట్టెలు, లైటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, బ్లూటూత్ హెడ్‌ఫోన్స్, ఎయిర్ పాడ్స్, ఇయర్ ఫోన్స్, గన్స్, పదునైన వస్తువులు, పెంపుడు జంతువులు, హెల్మెట్లు, బైనాక్యులర్స్, బ్యాగులు/హ్యాండ్ బ్యాగ్స్, బయటి తినుబండారాలు, ఫైర్ క్రాకర్స్, డ్రగ్స్‌లను స్టేడియంలోకి తీసుకెళ్లడానికి వీల్లేదు.. ఈ మేరకు రాచకొండ పోలీసులు ఇవాళ ఎక్స్ వేదికగా వెల్లడించారు. సామాన్లు భద్రపరిచే క్లాక్ రూమ్స్ కూడా అందుబాటులో లేవని స్పష్టం చేశారు. అందరికీ సురక్షితమైన, ఆనందించదగిన అనుభవాన్ని అందించడానికి పోలీస్ సిబ్బందితో సహకరించాలని స్టేడియానికి వచ్చే అభిమానులను కోరారు.
Read More..
10 మంది పిల్లల్ని కాపాడిన రాచకొండ పోలీసులు.. కాస్త ఆలస్యం అయితే ఎక్కడికి తరలించేవారో తెలుసా?