- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బర్రెలు, గొర్రెలు ఇచ్చి బిచ్చగాళ్లుగా మార్చుతున్నారు: R. కృష్ణయ్య
దిశ, తెలంగాణ బ్యూరో: బీసీలకు బర్రెలు, గొర్రెలు ఇచ్చి బిచ్చగాళ్లుగా చేస్తున్నారని బీసీ జాతీయ అధ్యక్షుడు ఆర్కృష్ణయ్య విమర్శించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేతృత్వంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బుధవారం జరిగిన భారీ ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్‌లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఇక తెలంగాణ లో 119 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 22 మంది మాత్రమే బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు.
129 బీసీ కులాలు ఉండగా, ఇప్పటికీ 120 కులాలు అసెంబ్లీ గడప తొక్కలేదన్నారు. కేంద్రం బడ్జెట్‌లో బీసీలకు కేవలం రూ.2 వేల కోట్లు కేటాయించి అన్యాయం చేసిందన్నారు. బీసీలకు విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉన్నప్పటికీ రాజకీయ రిజర్వేషన్లు కల్పించడం లేదన్నారు. దేశంలోని 29 రాష్ట్రాలలో 16 రాష్ట్రాల నుండి ఒక్క బీసీ పార్లమెంట్ సభ్యులు లేకపోవడం దారుణమన్నారు. 545 మంది ఉన్న లోక్ సభ సభ్యులలో కేవలం 96 మంది మాత్రమే బీసీలు ఉన్నట్లు వెల్లడించారు. దేశంలో అత్యధిక జనాభాలు ఉన్న బీసీలకు ఐఐటి, ఐఐఎం కోర్సులకు స్కాలర్షిప్‌లు, ఫీజులు రియంబర్స్మెంట్ స్కీమ్‌ను అందజేయాలన్నారు.