పండుగాడి పాస్‌పోర్ట్ తిరిగొచ్చేసిందోచ్.. ఒక్కసారి కమిట్ అయితే అతని మాట అతనే వినడంటున్న మహేష్ బాబు ఫ్యాన్స్

by Kavitha |   ( Updated:2025-04-06 04:31:24.0  )
పండుగాడి పాస్‌పోర్ట్ తిరిగొచ్చేసిందోచ్.. ఒక్కసారి కమిట్ అయితే అతని మాట అతనే వినడంటున్న మహేష్ బాబు ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి(SS Rajamouli) కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్‌ఎమ్‌బి-29(SSMB-29) వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఓ వైపు సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంటే వారానికి ఓసారి విదేశీ పర్యటనకు వెళుతున్న మహేష్ బాబును సింహాన్ని బోనులో బంధించినట్టు బందించి మహేష్ పాస్‌పోర్టును లాక్కున్నట్టు రాజమౌళి ఫొటోకు పొజు ఇచ్చారు. అప్పట్లో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

ఇక మహేష్ బాబు బుద్దిగా రాజమౌళి చెప్పినట్టుగా విని SSMB 29 ఫస్ట్ షెడ్యూల్‌ను ఫినిష్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఒరిస్సాలో ఈ షూటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ కావడం, సెకండ్ షెడ్యూల్‌కి కాస్త బ్రేక్ రావడంతో మహేష్ బాబుకి రాజమౌళి ఫ్రీడం ఇచ్చినట్టుగా ఉన్నాడు. దీంతో మహేష్ బాబు మళ్లీ తన కూతురితో కలిసి వేకెషన్‌కు వెళుతున్నాడు. అయితే ఎయిర్ పోర్టులో మీడియాకు చిక్కిన బాబు.. తన పాస్ పోర్ట్ చూపిస్తూ వెళ్లాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. ఇక దీన్ని చూసిన బాబు ఫ్యాన్స్ ఒక్కసారి కమిట్ అయితే అతని మాట అతనే వినడంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story