- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Governor:గొప్ప రాష్ట్రాలకు సేవ చేసినందుకు గర్వపడుతున్నా.. సీపీ రాధాకృష్ణన్
దిశ, డైనమిక్ బ్యూరో: మూడు గొప్ప రాష్ట్రాలకు సేవ చేసినందుకు గర్వపడుతున్నానని, దేశ సేవలో నా చివరి శ్వాస వరకు కృషి చేస్తానని తెలంగాణ మాజీ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ అన్నారు. నిన్నటి వరకు తెలంగాణ, జార్ఖండ్, పుదుచ్ఛేరి లకు గవర్నర్ గా పని చేసిన ఆయనను కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్ర గవర్నర్ గా నియమించింది. దీనిపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన రాధాకృష్ణన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా.. మా ప్రియమైన అత్యంత గౌరవనీయులైన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి, మన ప్రజానాయకుడు, మన ప్రియతమ అత్యంత గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ గారితో పాటు మన ప్రియమైన గౌరవనీయులైన హోం మంత్రి అమిత్ షా గారికి ధన్యవాదాలు తెలియజేశారు.
నన్ను మహారాష్ట్ర గవర్నర్‌గా నియమించి, గొప్ప రాష్ట్రానికి, మహారాష్ట్ర ప్రజలకు, భారతమాతకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు గర్వంగా ఉందని, దేశ సేవలో నా చివరి శ్వాస వరకు నా వంతు కృషి చేస్తానని హామీ ఇస్తున్నానని చెప్పారు. అంతేగాక మూడు గొప్ప రాష్ట్రాలైన జార్ఖండ్, తెలంగాణ, పుదుచ్చేరిలకు సేవ చేసే అద్భుతమైన అవకాశం లభించినందుకు నేను చాలా గర్వపడుతున్నానని, దానిని చాలా గౌరవంగా భావిస్తున్నానని సంతోషం వ్యక్తం చేశారు. అలాగే వాటిని ఎప్పటికీ ఆదరిస్తానని, ఎల్లప్పుడూ నా హృదయానికి దగ్గరగా ఉంటాయని, ఈ మూడు గొప్ప రాష్ట్రాలు బాగుండాలని కోరుకుంటున్నాను అని సీపీ రాధాకృష్ణన్ రాసుకొచ్చారు.