- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Yadadri Railway Station: యాదాద్రి రైల్వే స్టేషన్ లుక్.. ఎంతవరకు వచ్చిందంటే?

దిశ, డైనమిక్ బ్యూరో: యాదాద్రి రైల్వే స్టేషన్‌లో పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఇవాళ ప్రాజెక్టు పనుల వివరాలను తన ఎక్స్ అధికారిక ఖాతా ద్వారా వివరాలను పంచుకున్నారు. (Yadadri Railway Station) యాదాద్రి రైల్వే స్టేషన్ ప్రాజెక్టు స్థితి 38 శాతం పూర్తి అయిందని, ప్రాజెక్టు ఖర్చు రూ. 24.45 కోట్లు అంటూ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్లాట్‌ఫారమ్‌లు & స్తంభాల ఏర్పాటు పనులు పూర్తి అయ్యాయని వెల్లడించారు.
ఇక యాదాద్రి కొత్త స్టేషన్ భవనం, ప్లాట్‌ఫారమ్‌లపై అదనపు కవర్ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. యాదాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించే ప్రయాణికులు, భక్తుల అనుభవాన్ని మెరుగుపరచడానికి ప్రధాని మోడీ ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద యాదాద్రిలో అత్యాధునిక సౌకర్యాలను అభివృద్ధి చేస్తుందని పేర్కొన్నారు.