- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మటన్ కర్రీ తెచ్చిన తంటా.. వృద్ధుడి గొంతులో ఇరుక్కున్న ఎముక (వీడియో వైరల్)
దిశ, వెబ్‌డెస్క్: ఆదివారం వచ్చిందంటే ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో నాన్‌వెజ్ తప్పనిసరి. వారం అంతా కూరగాయాతో కుస్తీ పట్టిన మాంస ప్రియులు సండే వచ్చిందంటే ఓ పట్టు పట్టేస్తారు. ప్లేటు నిండా మంచి మంచి ముక్కలు, నల్లి బొక్కలు వేసుకుని మరీ దంచేస్తుంటారు. పేద, మధ్య తరగతి వారు చికెన్, చేపలతో సరిపెట్టుకుంటే.. కాస్త స్థోమత కలిగిన వారు మటన్‌తో విందు భోజనాన్ని ఆరగిస్తారు. కొన్ని సందర్భాల్లో ఆ భోజనమే మన ప్రాణాలు మీదకు తీసుకొస్తుంది. అచ్చం అలాంటి ఘటనే యాద్రాద్రి జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామానికి చెందిన అనంతుల శ్రీరాములు నిన్న మటన్ కర్రీతో భోజనం చేస్తుండగా ఓ ఎముక గొంతులో అడ్డుపడింది. దీంతో ఆ వృద్ధుడు నానా అవస్థలు పడ్డాడు. ఎముకును ఎలాగోలా తొలగించాలని కుటుంబ సభ్యులు తీవ్రంగా శ్రమించారు. అయినా.. ఎముక బయటకు రాకపోవడంతో చికిత్స నిమిత్తం అతడిని హైదరాబాద్ కామినేని ఆసుపత్రికి తీసుకొచ్చారు. అనంతరం ఎండోస్కోపీతో మటన్ బొక్కని తీసి వృద్ధుడి ప్రాణాలు కాపాడారు. దీంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. నాన్‌వెజ్ తినడం తప్పుకాదు.. తినే ముందు చూసుకుని తినాలని, లేకపోతే ఇలాంటి ఉపద్రవాలే వస్తాయని వైద్యులు సూచిస్తున్నారు.