Printing Errors: ఇంటర్ ప్రశ్నాపత్రంలో ప్రింటింగ్ లోపం! క్వాలిటీని పెంచాలని నెట్టింట చర్చ

by Ramesh N |   ( Updated:2025-03-10 11:06:41.0  )
Printing Errors: ఇంటర్ ప్రశ్నాపత్రంలో ప్రింటింగ్ లోపం! క్వాలిటీని పెంచాలని నెట్టింట చర్చ
X

దిశ, డైనమిక్ బ్యూరో: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే ఓ ప్రశ్నపత్రం పేపర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్‌లో చాట్ ఆధారంగా ఇచ్చిన 7 ప్రశ్నకు ప్రింట్ లోపం ఏర్పడింది. ప్రశ్నపత్రంలోని ఏడో ప్రశ్నలో డిస్టింగ్‌క్షన్, మెరిట్, పాస్, ఫెయిల్ అనే ఆప్షన్స్ గుర్తించే వీల్లేకుండా అంటే కనిపించకుండా ప్రింట్ వచ్చింది. ఇన్విజిలేటర్స్ ని స్టూడెంట్స్ అడిగితే అందరికీ అలాగే ప్రింట్ వచ్చిందని సమాధానం ఇచ్చినట్లు తెలిసింది.

ఇంటర్ ప్రశ్నాపత్రం ప్రింటింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల 4 మార్కులు నష్టపోతున్నారని స్టూడెంట్స్, పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రింటింగ్‌లో క్వాలిటీని పెంచాలని స్టూడెంట్స్, పేరెంట్స్ కోరుతున్నారు. కాగా, ఏపీలో మార్చి 5న జరిగిన ఇంగ్లిష్ క్వశ్చన్‌ పేపర్‌లో 8, 13 ప్రశ్నలు సరిగ్గా ప్రింట్ అవ్వలేదని విద్యార్థులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఇంటర్‌లో 50% పైగా కంటి చూపు తక్కువగా ఉన్నవారే ఉంటారని, అలాంటప్పుడు ప్రింట్ సరిగ్గా లేని ప్రశ్నలు గుర్తించడం కష్టమేనని నిపుణులు చెబుతున్నారు.



Next Story