అల్లాదుర్గం బహిరంగ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 12 |
అల్లాదుర్గం బహిరంగ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు బీజేపీ మెదక్ జిల్లా అల్లాదుర్గం లో భారీ బహిరంగ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సభకు భారత ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగులో తన ప్రసంగించారు. అలాగే గత పది సంవత్సరాలలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కేవలం ట్రైలర్ మాత్రమే అన్నారు. అలాగే దేశ వ్యాప్తంగా తెలుగు సినిమి ఆర్ఆర్ఆర్ ఎంతో ఫేమస్ అయిందని ఇది దేశ ప్రజల మన్ననలను అందుకుందని అన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆర్‌ఆర్ ట్యాక్స్‌తో ఫేమస్ అయిందని.. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి, రాహుల్ ట్యాక్స్ వసూల్ చేస్తున్నారని ప్రధాని మోడీ విమర్శించారు.

అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ఆడుతూ.. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ.. అవినీతి చేస్తుందని అన్నారు. అలాగే కాంగ్రెస్ ఎక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పంచ సూత్రాలతో ప్రభుత్వాన్ని నడిపిస్తుందని.. వారి దృష్టిలో పంచసూత్రాలు అంటే.. అవినీతి, అభద్దం, ఓటు బ్యాంకు రాజకీయం, మాఫీయా, కుటుంబ రాజకీయం అని ప్రధాని విమర్శించారు. అలాగే దేశంలో మళ్లీ పాత రోజులు తీసుకురావాలని కాంగ్రెస్ చూస్తోందని.. దేశ ప్రజల సంపదలో 50 శాతం దోచుకుని మళ్లించాలని చూస్తుందని.. ఈ కాంగ్రెస్ పార్టీ విధానాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. దేశ అభివృద్ధి కోసం బీజేపీని మరోసారి గెలిపించాలని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.

Next Story

Most Viewed