తప్పు చేసి ఉంటే ఎంత పెద్ద శిక్షకైనా సిద్ధం!.. జైలు నుంచి మన్నె క్రిశాంక్ లేఖ

by Disha Web Desk 5 |
తప్పు చేసి ఉంటే ఎంత పెద్ద శిక్షకైనా సిద్ధం!.. జైలు నుంచి మన్నె క్రిశాంక్ లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉస్మానియా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ జారీ చేసిన అధికారిక లేఖను మార్ఫింగ్ చేశారన్న కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ చంచల్ గూడ జైలు నుంచి లేఖ రాశారు. ఈ లేఖలో తన అరెస్ట్ ను ఖండిస్తూ, తనకు అండగా నిలిచిన బీఆర్ఎస్ నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ నాకు మద్దతుగా నిలిచి నాలో ధైర్యాన్ని నింపారని తెలియజేశారు. అంతేగాక తనకు మద్దతుగా నిలచిన న్యాయవాదులకు, దీన్ని కవర్ చేస్తున్న మీడియా మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

దీనిపై నా పోరాటం కొనసాగుతుందని, తాను ఒరిజినల్ సర్కూలర్ పోస్ట్ చేశానని, తప్పుడు సర్క్యూలర్ పోస్ట్ చేశానని నిరూపిస్తే ఎంత పెద్ద శిక్షకైనా సిద్ధమని లేఖలో పేర్కొన్నారు. ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు సర్క్యూలర్ పోస్ట్ చేసి తెలంగాణ ప్రజలను మోసం చేసి ఉంటే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలి అని మన్నె క్రిశాంక్ డిమాండ్ చేశారు. కాగా ఉస్మానియా యూనివర్సిటీలో వేసవి సెలవుల కారణంగా వర్సిటీ చీఫ్ వార్డెన్ విడుదల చేసిన లేఖను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని, ఫలితంగా యూనివర్సిటీ ప్రతిష్టకు భంగం కలిగిందని ఓయూ చీఫ్ వార్డెన్ ఓయూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మన్నె క్రిశాంక్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మన్నె క్రిశాంక్ కు రిమాండ్ విదించగా.. పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు.

Next Story

Most Viewed