ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాతో టచ్‌లో ఉన్నారు: కేఏ పాల్

by GSrikanth |   ( Updated:2023-02-12 15:27:58.0  )
ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాతో టచ్‌లో ఉన్నారు: కేఏ పాల్
X

దిశ, తెలంగాణ బ్యూరో: 'నూతన సచివాలయంలో అగ్నిప్రమాదం, ఓపెనింగ్ విషయం తేలేదాకా ఎన్ని అరెస్టులు, గృహనిర్భందాలు చేస్తారో చేసుకోండి.. నా పోరాటం మాత్రం ఆగదు.. తగ్గేదేలే' అంటూ ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ అన్నారు. సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించిన నేతలను పర్సనల్ ఎటాక్ చేస్తున్నారని, ఫోన్ ట్యాంపరింగ్ చేయిస్తున్నారని ఆరోపించారు. ఆదివారం ఢిల్లీలో తెలంగాణ భవన్‌లో మీడియాతో కేఏ పాల్ మాట్లాడారు. నూతన సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా పడడం తెలంగాణ ప్రజల విజయమన్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్‌కు, సచివాలయం ఓపెనింగ్ వాయిదాకి లింక్ ఏంటని ప్రశ్నించారు. అగ్నిప్రమాద ఘటనపై సుప్రీంకోర్టులో పోరాటం చేస్తున్నానని తెలిపారు. అంబేద్కర్ జయంతి రోజున నూతన సచివాలయం ఎట్టి పరిస్థితిలో ఓపెన్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై హైకోర్టులో మరోసారి వాదనలు వినిపించనున్నట్లు వెల్లడించారు.

ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాతో టచ్‌లో ఉన్నారు..

తెలంగాణను అభివృద్ధి చేద్దామంటే సీఎం కేసీఆర్ వినడం లేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ సైతాన్ మార్గంలో వెళ్తున్నారని విమర్శించారు. ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని కేఏ పాల్ కీలక వ్యాఖ్యాలు చేశారు. ఢిల్లీలో ఎవరిని కలిశానో త్వరలో చెబుతానన్నారు. అదానీ అవినీతికి కారణం ప్రధాని మోడీ నేనని విమర్శించారు. స్టీల్ ప్లాంట్‌ను ఆదానికి మోడీ అమ్మబోయాడని ఆరోపించారు. బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ 'బీ' పార్టీ అని అందరికీ తెలుసన్నారు. మోడీ పార్లమెంట్‌లో పెట్టిన ప్రతి బిల్లుకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారని గుర్తుచేశారు.

Also Read...

మళ్లీ బీఆర్ఎస్‌లో చేరికపై ఈటల రాజేందర్ క్లారిటీ

Advertisement

Next Story

Most Viewed