- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Prabhakar Rao : ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు తిప్పలు..రాజకీయ శరణార్ధిగా గుర్తించాలని యూఎస్ సర్కార్ కు వినతి
దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone tapping case)లో కీలక నిందితుడిగా ఉన్న ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు( Prabhakar Rao)తెలంగాణ పోలీసులకు మరో ఝలక్ ఇచ్చాడు. కేసు విచారణ ప్రారంభ దశలోనే అమెరికా వెళ్లిపోయిన ప్రభాకర్ రావు అనారోగ్య సమస్యల సాకుతో విచారణకు గైర్హాజరవుతూ అమెరికాలోనే ఉండిపోయారు. ఎస్ఐబీ అదనప్పు ఎస్‌పీ రమేశ్ మార్చి 10న పోలీసులకు ఫిర్యాదు చేయగా, 11న యూఎస్ ప్రభాకర్‌రావు అమెరికా వెళ్లిపోయి ఫ్లోరిడాలోని తన కుమారుడి ఇంట్లో ఉంటున్నాడు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను చేస్తున్న తెలంగాణ పోలీసులకు చిక్కడు దొరకడుగా మారిన ప్రభాకర్ రావు తాజాగా తనను రాజకీయ శరణార్ధిగా గుర్తించాలంటూ అమెరికా ప్రభుత్వాని(US Government) కి విజ్ఞప్తి చేసుకున్నారని సమాచారం. తనకు ఆరోగ్య సమస్యలున్నాయని, తనను తెలంగాణ ప్రభుత్వం కేసుల పేరుతో వేధిస్తుందని తన పిటిషన్ లో పేర్కొన్నాడు. ఇటు తెలంగాణ పోలీసులు సైతం ప్రభాకర్ రావును స్వదేశానికి రప్పించేందుకు రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావుకు అమెరికాలో శాశ్వత నివాసానికి వీలు కల్పించే గ్రీన్‌కార్డు మంజూరైనట్లు తెలుస్తోంది. అక్కడ స్థిరపడిన ప్రభాకర్‌రావు కుటుంబ సభ్యుల స్పాన్సర్ షిప్‌తో ఆయనకు గ్రీన్‌కార్డు మంజూరైనట్లుగా సమాచారం. గ్రీన్‌కార్డుదారుకు అమెరికాలో శాశ్వత నివాసానికి అనుమతి ఉంటుందనే విషయం తెలిసిందే. దాంతో ప్రభాకర్‌రావు ఇప్పట్లో స్వదేశానికి తిరిగే వచ్చే అవకాశం లేదని భావిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను తప్పించేకునేందుకు తిప్పలు పడుతున్న ప్రభాకర్ రావు తనను రాజకీయ శరణార్ధిగా గుర్తించాలంటూ అమెరికా ప్రభుత్వానికి చేసుకున్న విజ్ఞప్తికి ఆమోదం లభిస్తే ఇప్పట్లో ఆయనను విచారణకు రప్పించడం మరింత ప్రశ్నార్ధకం కానుంది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సహా, పలువురు ప్రముఖులు, వ్యాపారులు, సెలబ్రేటీల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వారి నుంచి అక్రమంగా వందల కోట్లు డబ్బులు వసూలు చేసినట్లు అభియోగాలు ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ఈ వ్యవహారంపై సీరియస్‌గా దృష్టి పెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం పలువురు పోలీస్ అధికారులకు నోటీసులు జారీ చేయటంతో పాటు నలుగురు అధికారులు ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్ రావులను సిట్ అరెస్ట్ చేసింది. ఎస్‌బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నేతృత్వంలోని బృందం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. కేసు దర్యాప్తులో భాగంగా ప్రభాకర్‌రావును కేసులో ప్రధాన నిందితుడిగా చేర్చారు. కోర్టులో అభియోగపత్రం నమోదు చేసి, ఆయనను అమెరికా నుంచి రప్పించే ప్రయత్నాలు చేశారు.
వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లినట్లు తొలుత ప్రభాకర్‌రావు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మూడు నెలల కాలపరిమితితో కూడిన వీసాపై వెళ్లిన తాను జూన్‌లో తిరిగి వస్తానని తెలిపారు. కానీ, వీసా గడువు ముగిసినా ఆయన అక్కడే ఉన్నారు. ఈ క్రమంలో ఆయన తన వీసా గడువును మరో ఆరు నెలలకు పొడిగించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దాంతో ఆయనపై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడంతో పాటు పాస్ పోర్టును రద్దు చేశారు. ఆ విషయాన్ని విదేశాంగ శాఖ ద్వారా అమెరికా పోలీసులకు చేరవేసే ప్రయత్నాల్లో పోలీసులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ రావుకు తాజాగా అమెరికాలో గ్రీన్‌కార్డు మంజూరైనట్లు సమాచారంతో పాటు రాజకీయ శరణార్థిగా గుర్తించాలని కోరడం పోన్ ట్యాపింగ్ కేసుకు అవరోధంగా మారనుంది.