- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అయోధ్యలో అపురూప ఘట్టం.. బాల రాముడి నుదిటిపై సూర్య తిలకం

దిశ, వెబ్ డెస్క్: శ్రీరామ నవమి సందర్భంగా అయోధ్య (Ayodhya)లోని శ్రీ రామ జన్మభూమి మందిరం (Sri Rama Janmabhoomi Temple)లో అపురూప ఘట్టం (incredible event) ఆవిష్కృతం అయింది. బాల రాముడి నుదిటిపై సూర్య తిలకం (Surya tilak on Rama's forehead) పడింది. ఈ అద్భుత ఘట్టం గా జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలు బాల రాముడి నుదిటిపై సూర్య తిలకం దిద్ది.. సుమారు 4 నిమిషాల పాటు ఉంది. అయితే ఎన్నో సంవత్సరాల పోరాటాల తర్వాత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ అయోధ్య దేవాలయం.. ప్రతీ శ్రీరామ నవమి రోజులు రాముని నుదిటిపై నేరుగా సూర్యకిరణాలు తిలకంగా పడేలా ఏర్పాట్లు చేశారు.
ఈ సంఘటన కోసం ఆలయంలో అద్దాలు, లెన్స్‌లతో కూడిన ప్రత్యేక సాంకేతిక వ్యవస్థ (Technical system) ను ఉపయోగించారు. దీని ద్వారా సూర్య కాంతి గర్భగుడిలో విగ్రహంపై ఖచ్చితంగా ప్రసరిస్తుంది. ఈ సంప్రదాయం (Tradition) రాముడి జన్మ సమయాన్ని సూచించే మధ్యాహ్నం 12 గంటలకు జరిగింది. ఇది ఇక్ష్వాకు వంశానికి (Ikshvaku dynasty) కులదైవమైన సూర్య భగవానుడితో (Sun God) రాముడి సంబంధాన్ని ప్రతిబింబిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ అద్భుత ఘట్టాన్ని చూసేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ (Sri Rama Janmabhoomi Teerth Kshetra Trust) ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేసింది. 2024లో జరిగిన మొదటి సూర్య తిలకం తర్వాత, ఈ సంఘటన రెండో సంవత్సరం కూడా భక్తులను ఆకర్షించింది.